ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం :: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం :: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రచురణార్థం

*ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్*

*కొత్త పంచాయతీ భవనం ప్రారంభం*

*ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి*

*ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన రాష్ట్ర సంక్షేమ మంత్రి*

పెద్దపల్లి, జనవరి 22:-

దేశంలోనే ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

శనివారం ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి పర్యటించారు. న్యూ కొత్తపల్లి గ్రామం లో రూ.20 లక్షలతో నిర్మించిన నూతన పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి 42 మంది లబ్ధిదారులకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, దేశానికి ఆదర్శవంతంగా సంక్షేమ పాలన సీఎం కేసీఆర్ అందిస్తున్నారని తెలిపారు.

ఆసరా పింఛన్లు ,కళ్యాణలక్ష్మీ షాదీ ముబారక్, రైతు బంధు ,రైతు బీమా, దళిత బంధు, కెసిఆర్ కిట్, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి తెలిపారు.

నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నూతన జిల్లాలను మండలం రెవెన్యూ డివిజన్లను గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని, ధర్మారం మండలం లో 6 నూతన పంచాయతీల ఏర్పడ్డాయని మంత్రి తెలిపారు.

కొత్తపల్లి గ్రామంలో మరో 20 లక్షలతో త్వరలో సీసీ రోడ్ల పనులు పూర్తి చేస్తామని, గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, గ్రామంలో పెండింగ్లో ఉన్న పాడి గేదెల పంపిణీ ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తామని మొదటి విడతగా గ్రామానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు 2 గేదెలను త్వరగా అందిస్తామని మంత్రి తెలిపారు.

అనంతరం నర్సింగాపూర్ గ్రామంలో 28 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను, 12.6 లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ధర్మారం మండలానికి చెందిన 42 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు 47 లక్షల 5వేల 452 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు, ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
—————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి పెద్దపల్లి చే జారి చేయబడినది.

Share This Post