ప్రజా సమస్యలకు సత్వరమే పరిష్కారం… జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

ప్రచురణార్థం

ప్రజా సమస్యలకు సత్వరమే పరిష్కారం…

మహబూబాబాద్ జూలై 19:

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి.గౌతం తెలిపారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే లో ప్రజల వద్ద నుండి పలు విజ్ఞప్తులను స్వీకరించారు.

కేసముద్రం మండలం కాట్ర పల్లి గ్రామానికి చెందిన సునీత దసృ నాయక్ దరఖాస్తు అందిస్తూ మహబూబాబాద్ నుండి కాట్రపల్లి మీదుగా గుండెంగ వరకు బస్సు నడిచేదని, కరోనాతో నిలుపుదల చేశారని, తిరిగి కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

అలాగే తమ గ్రామానికి చెందిన ప్రజలు సబ్ సెంటర్ లేక పదిహేను కిలోమీటర్లు ఇంటికన్నె కు వెళుతున్నా రని, ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని దసృ నాయక్ విజ్ఞప్తి చేశారు.

కాట్రపల్లి గ్రామానికి చెందిన పాల్వాయి వెంకటరెడ్డి తన దరఖాస్తును అందిస్తూ గూడూరు మండలం రాజంపల్లి రెవెన్యూ లో ఎస్సారెస్పీ కాలువల కింద తన భూమి 22 కుంటలు తీసుకున్నారని, మిగిలిన నాలుగు ఎకరాల భూమి కూడా స్వాధీనం చేసుకుని, ఎటువంటి నష్ట పరిహారం చెల్లించలేదని తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

తొర్రూరు మండలం చెర్లపాలెంకు చెందిన ఉప సర్పంచ్ ధర్మారపు శ్రీనివాస్, వార్డు సభ్యులు హరి కృష్ణ, మంజుల వెంకన్న, యమున అంజయ్య, గజ్జి యాకయ్య, మహేందర్, సుధాకర్ తదితరులు తమ దరఖాస్తును అందిస్తూ గ్రామ సర్పంచ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఫిర్యాదును అందించారు.

మహబూబాబాద్ మండలం mudupugal కు చెందిన మాతంగి శ్రీను తన దరఖాస్తును అందిస్తూ తమ తల్లిదండ్రులు వికలాంగులు అని తెలంగాణ ప్రభుత్వం దళితులకు తన తండ్రి పేరున అందజేసిన మూడెకరాల భూమిని తన అన్న మాతంగి కృష్ణ ఒక్కరే సాగు చేసుకుంటూ తనని ఇబ్బంది పాలు చేస్తున్నారని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదే మండలం నడివాడ గ్రామానికి చెందిన మునిగే నాగరాజు తాను వికలాంగుడు అయినందున ట్రై సైకిల్ ను మంజూరు జేయాలని అని విజ్ఞప్తి చేశారు.

దరఖాస్తులను సంబంధిత శాఖలకు అందజేస్తూ త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ గ్రీవెన్స్ డే లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అదనపు కలెక్టర్ కొమరయ్య జిల్లా అధికారులు పాల్గొన్నారు
————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post