ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి…..

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి…..

ప్రచురణార్థం

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి…..

మహబూబాబాద్, ఏప్రిల్ -25:

ప్రజావాణి లో తెలిపిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అభిలాష అభినవ్, ఎం. డేవిడ్ లు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అభిలాష అభినవ్ ఎం.డేవిడ్ తో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

కేసముద్రం పట్టణానికి చెందిన వి కొమురయ్య 73 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమికి పట్టా ఇవ్వాలని కోరారు.

మరిపెడ మండలం తానం చర్ల గ్రామానికి చెందిన మల్లికంటి మమత తన భర్త మరణానంతరం ఆయన పేరు మీద గల 5 ఎకరాల ఏడు గంటల భూమి తన పేరున చేయాలని కోరారు.

మరిపెడ మండలం గాలి వారి గూడెం కు చెందిన ఏడేల్లి ఉపేందర్ తన భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మృతి చెందారని, విచారణ జరిపి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు.

తొర్రూరు మండలం అరిపిరాల గ్రామానికి చెందిన 20 కుటుంబాలకు చెందిన ప్రజలు తమకు 40 సంవత్సరాలుగా ఉన్న రహాదారిని చెవిటి సుధాకర్ ఆక్రమించి కార్ షెడ్ నిర్మాణం చేశారని, ఇట్టి విషయమై జిల్లా అధికారులకు, గ్రామ పంచాయతీ కార్యదర్శికి తెలిపామని, తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

ఎక్కువగా భూ సంబంధిత సమస్యలపై అర్జీలు వచ్చాయి. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం (58) అర్జీలు వచ్చాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
———————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post