ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -01:

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు అర్జీలను అందజేస్తూ దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం (65) అర్జీలు వచ్చాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, హరిత హారంలో నాటిన మొక్కలకు సంబంధించి జియో ట్యాగింగ్ చేయడం లేదని, వెంటనే జియో ట్యాగింగ్ చేయాలని తెలిపారు. ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన హాస్టల్ లను సందర్శించి పరిశీలన పూర్తి చేసి వివరాలు సమర్పించాలని తెలిపారు.

ఈ ప్రజావాణి లో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post