ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రజావాణి కార్యక్రమం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో 87, విజ్ఞప్తులు స్వీకరణ ప్రజావాణిలో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్,

పత్రిక ప్రకటన

తేదీ : 23–05–2022

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రజావాణి కార్యక్రమం

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో 87,  విజ్ఞప్తులు స్వీకరణ

ప్రజావాణిలో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, డీఆర్వో లింగ్యానాయక్

జిల్లా వ్యాప్తంగా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ అన్నారు. సోమవారం  ప్రజావాణి కార్యక్రమాన్ని  కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో నిర్వహించారు. ప్రజావాణిలో వచ్చి ప్రతి దరఖాస్తు, సమస్యలను వీలైనంత త్వరగా  పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తూ, నిబద్దతతో పని చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. ఫిర్యాదుదారులు అనవసర ఇబ్బందులకు గురి చేయకుండా సమస్యల సత్వర పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఆయా శాఖల జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post