ప్రజా సమస్యలు, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రజా సమస్యలు, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం……1

తేదీ.20.9.2021

జగిత్యాల, 20 సెప్టెంబర్:- జిల్లా లోని ప్రజల సమస్యల పై ప్రజావాణి కార్యక్రమం ద్వారా వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా అధికారులతో కన్వర్జెన్సీ మరియు డి.ఆర్.డి.ఓ., ఎం.పి.డి.ఓ.లతో ఉపాధి హామీ పనుల లేబర్ టర్న్ ఔట్ లపై జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు తగు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.

జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాల పట్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వాటిని వెంటనే తగు చర్యలు తీసుకొని వాటిని పరిష్కరించాలని సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వర్షాల పట్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అన్నారు. ఇందుకు గ్రామపంచాయతీ, ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల వల్ల వచ్చే సమస్యలపై సకాలంలో స్పందించాలి అన్నారు.జిల్లాలో ఎక్కడ ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా చూడాలని తెలియచేసారు.

హరితహారం కార్యక్రమం లో భాగంగా అవసరమైన గ్రామాలు పట్టణాల్లో నివాసాల వద్ద ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఎప్పటికప్పుడు సందర్శించి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాటిన మొక్కలను పరిరక్షించాలి అన్నారు. మొక్కలు పాడవకుండా చుట్టూ ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో మొక్కలకు నీరు పట్టే అవసరం తాత్కాలికంగా లేదన్నారు. అయినప్పటికీ మొక్కలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పనుల ద్వారా చేపడుతున్న పనుల లేబర్ టర్న్ ఔట్ జిల్లాలో 17% ఉన్నదని డి.ఆర్.డి.ఓ. తెలుపగా మండలలా వారీగా లేబర్ టర్న్ ఔట్ పెంచాలని ఎం.పి.డి.ఓ.లను కలెక్టర్ ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో పారిశుద్ధ్యం మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ లో సందర్శించినప్పుడు కొన్ని గ్రామాల్లో పారిశుధ్యం లోపించిందన్నారు. దీన్ని వెంటనే సరి చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపిస్తే వ్యాధులు సంక్రమిస్తాయి అని, పారిశుద్ధ్యం లోపించకుండా చూసుకోవాలి అన్నారు. ఎప్పటికప్పుడు రహదారులను శుభ్రం చేయడంతో పాటు మురికి కాల్వలను శుభ్రం చేయించాలన్నారు. వర్షపు నీరు వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలన్నారు. గ్రామాల్లో గోడలపై ఎలాంటి అనవసమైన రాతలు లేకుండా చూసుకోవాలని అన్నారు.

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా నిఘా పెంచాలన్నారు. మున్సిపల్ పరిధిలో వక్ఫ్ భూములు, దేవాలయ భూములు వంటివి మొదలగునవి పరిరక్షించాలి అన్నారు. గణేష్ నిమజ్జనం పూర్తయిన సందర్భంగా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ టెస్టులను మరింత పెంచాలన్నారు. ఎక్కువ మొత్తంలో టెస్టులు చేస్తేనే కోవిడ్ ను అరికట్టవచ్చు అన్నారు. ఇంట్లో ఒకరికి కోవిడ్ వస్తే దాని వ్యాప్తిని అక్కడికక్కడే ఆపేయాలి అన్నారు. ప్రధానంగా ఆర్టి పిసిఆర్ టెస్టులను పెంచాలన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వైరల్ ఫీవర్ పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని , ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో నిర్ణిత టార్గెట్ మేరకు టీకాలు అందించాలని తెలియచేసారు. ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే నిర్వహించాలన్నారు. డిఎం అండ్ హెచ్ఓ, జిల్లా ఆసుపత్రి సూపర్వైజర్లు సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని, సి.ఎం.ఓ., కోర్టు కేసులు, వివిధ కమీషన్ల కార్యాలయాల ద్వారా జారీ అయిన డి.ఓ. లేఖలు, ఫిర్యాదుల పై తోరగా స్పందించాలని సూచించారు.జిల్లా కార్యాలయలలో ఈ-ఆఫీస్ నందు ఫైల్స్ పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వం నుండి పలు అభివృద్ధి పనుల కై కేటాయించిన నిధులను సకాలంలో, సక్రమంగా వినియెగించాలని, నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న పనుల వివరాలు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి చెల్లింపులు సకాలంలో అయ్యేలా చూడాలన్నారు. పై అధికారులకు పంపే రిపోర్టులు సక్రమంగా పొరపాట్లు లేకుండా పంపాలన్నారు.

ఈ సమావేశంలో ఆర్.డి.ఓ. జగిత్యాల, కోరుట్ల, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post