ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్ధం—-2

తేదీ.21.4.2022

ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల, ఏప్రిల్-21: జిల్లాలో ప్రతి మండలంలో రెవెన్యూ సమస్యలను అధిక ప్రాధాన్యత ఇస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి రెవెన్యూ సర్వీసులు , ఇతర అంశాలపై అధికారులతో జూమ్ వెబ్ కాన్పరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సదర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కారుణ్య నియామకాల ప్రక్రియ పెండింగు ఉండకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. జిల్లాలో ఉన్న రెండు డివిజన్ల వారీగా ఆర్డీవోలు కారుణ్య నియామకాల ప్రక్రియ పై ఎప్పటికప్పుడు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మండలాల వారీగా తహసీల్దార్లు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.మండలాలలో రైస్ మిల్లర్ల వారీగా పెండింగ్ ఉన్న సీఎంఆర్ రైస్ డెలివరీ నివేదికను అందజేస్తామని తహసీల్దార్లు రైస్ మిల్లర్ల పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.

జగిత్యాల పట్టణంలో జూలై మాసానికి 4500 రెండు పడక గదుల ఇల్లు నిర్మాణం పూర్తవుతుందని, రేషన్ షాప్ ల వారీగా సొంత ఇల్లు లేని తెల్ల రేషన్ కార్డు కార్డు దారులు జాబితా తయారు చేయాలని కలెక్టర్ సూచించారు.

,కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ మరియు మీసేవా పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, కళ్యాణ లక్ష్మీ చెక్కులు ప్రభుత్వ నిబంధనల మేరకు స్థానిక ఎమ్మెల్యేలు, రెవెన్యూఅధికారులు మాత్రమే పంపిణీ చేయాలని , వేరే ఇతరులతో పంపిణీ చేయరాదని తెలిపారు.

ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి పిటీషన్ల పై సత్వరమే చర్యలు తీసుకొవాలని సూచించారు.ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులు, సీఎం కార్యాలయం నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు.

ఈ ఆఫీస్ ద్వారా ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని పేర్కోన్నారు. పెండింగ్ మ్యూటేషన్లు, చెక్ మెమోలపై మీ సేవా సెంటర్ల ద్వారా మాత్రమే ధరఖాస్తులు చేసుకోవాలని, సిబ్బందికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనంలు , సర్వీసు మ్యాటర్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అన్నారు. చౌకధరణ దుకాణాల పై తరుచూ తనిఖీలు నిర్వహించి బియ్యం అక్రమ రవాణా జరుగకుండ చర్యలు తీసుకోవాలని, ఇసుక అక్రమ రవాణా పై ప్రత్యేక శ్రద్ధ వహించి రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాల్లో భూమి సక్సెషన్ అంశాల్లో కొన్ని సమయాల్లో ఇంటిపేరు ఒకే విధంగా ఉండటం వల్ల తప్పులు జరిగే ప్రమాదముందని, దీనికోసం గ్రామ పెద్దల వద్ద మరోసారి ధ్రువీకరించి సక్సెషన్ చేయాలని కలెక్టర్ సూచించారు. మండలాల్లో ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినా అధికారులపై వేసిన విచారణ కమిటీల నివేదికలు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

భూముల రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమైతే సాయంత్రం అధిక సమయం కేటాయించాలని, ప్రతిరోజు బుక్ చేసుకున్న స్లాట్ల మేర రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలని కలెక్టర్ తహసీల్దార్లను అదేశించారు.

మండలాల్లో ఈ ఆఫీస్ వినియోగంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నూతన భవన నిర్మాణ అనుమతుల జారీ సైతం కలెక్టర్ చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయా మండలం లో జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో ఏర్పాటు చేసే బ్యానర్లు ప్రోటోకాల్ ప్రకారం ఉన్నది లేనిది పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, ఇంచార్జి అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి మాదురి, 18మండలాల తహసీల్దార్లు , ఏ ఓ , కలెక్టరేట్, పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జగిత్యాల చే జారి చేయనైనది.

ప్రచురణార్ధం----2  తేదీ.21.4.2022  ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి  జగిత్యాల, ఏప్రిల్-21:  జిల్లాలో ప్రతి మండలంలో రెవెన్యూ సమస్యలను  అధిక ప్రాధాన్యత ఇస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి రెవెన్యూ సర్వీసులు , ఇతర అంశాలపై  అధికారులతో  జూమ్ వెబ్ కాన్పరెన్స్ ద్వారా  సమీక్షా సమావేశం నిర్వహించారు.    ఈ సదర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కారుణ్య నియామకాల ప్రక్రియ పెండింగు ఉండకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. జిల్లాలో ఉన్న రెండు డివిజన్ల వారీగా ఆర్డీవోలు కారుణ్య నియామకాల ప్రక్రియ పై ఎప్పటికప్పుడు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.   జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మండలాల వారీగా తహసీల్దార్లు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.మండలాలలో రైస్ మిల్లర్ల వారీగా పెండింగ్ ఉన్న సీఎంఆర్ రైస్ డెలివరీ నివేదికను అందజేస్తామని తహసీల్దార్లు రైస్ మిల్లర్ల పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.   జగిత్యాల పట్టణంలో జూలై మాసానికి 4500 రెండు పడక గదుల ఇల్లు నిర్మాణం పూర్తవుతుందని, రేషన్ షాప్ ల వారీగా సొంత ఇల్లు లేని తెల్ల రేషన్ కార్డు కార్డు దారులు జాబితా తయారు చేయాలని కలెక్టర్ సూచించారు.  ,కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ మరియు  మీసేవా పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, కళ్యాణ లక్ష్మీ చెక్కులు ప్రభుత్వ నిబంధనల మేరకు స్థానిక ఎమ్మెల్యేలు, రెవెన్యూఅధికారులు మాత్రమే పంపిణీ చేయాలని , వేరే ఇతరులతో పంపిణీ చేయరాదని తెలిపారు.   ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన  ప్రతి పిటీషన్ల పై సత్వరమే చర్యలు తీసుకొవాలని సూచించారు.ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులు, సీఎం కార్యాలయం   నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు.   ఈ ఆఫీస్ ద్వారా  ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని పేర్కోన్నారు. పెండింగ్ మ్యూటేషన్లు, చెక్ మెమోలపై  మీ సేవా సెంటర్ల  ద్వారా మాత్రమే  ధరఖాస్తులు చేసుకోవాలని, సిబ్బందికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనంలు , సర్వీసు మ్యాటర్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని  అన్నారు.  చౌకధరణ దుకాణాల పై తరుచూ తనిఖీలు నిర్వహించి బియ్యం అక్రమ రవాణా జరుగకుండ చర్యలు తీసుకోవాలని, ఇసుక అక్రమ రవాణా పై ప్రత్యేక శ్రద్ధ వహించి రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.     గ్రామీణ ప్రాంతాల్లో భూమి  సక్సెషన్ అంశాల్లో కొన్ని సమయాల్లో ఇంటిపేరు ఒకే విధంగా ఉండటం వల్ల తప్పులు జరిగే ప్రమాదముందని, దీనికోసం గ్రామ పెద్దల వద్ద మరోసారి ధ్రువీకరించి సక్సెషన్ చేయాలని కలెక్టర్ సూచించారు.   మండలాల్లో ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినా అధికారులపై వేసిన విచారణ కమిటీల నివేదికలు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.   భూముల రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమైతే సాయంత్రం అధిక సమయం కేటాయించాలని, ప్రతిరోజు బుక్ చేసుకున్న స్లాట్ల మేర రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలని కలెక్టర్ తహసీల్దార్లను అదేశించారు.  మండలాల్లో ఈ  ఆఫీస్ వినియోగంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నూతన భవన నిర్మాణ అనుమతుల జారీ సైతం కలెక్టర్ చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయా మండలం లో జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో ఏర్పాటు చేసే బ్యానర్లు ప్రోటోకాల్ ప్రకారం ఉన్నది లేనిది పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, ఇంచార్జి అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి మాదురి, 18మండలాల తహసీల్దార్లు , ఏ ఓ , కలెక్టరేట్, పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.  జిల్లా పౌరసంబంధాల అధికారి, జగిత్యాల చే జారి చేయనైనది.
ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

Share This Post