* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి ఆగస్టు 30 ( సోమవారం).
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించి సత్వర పరిష్కారం దిశగా సంబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేశారు. ఈ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వివిధ సమస్యలపై ప్రజలు అందించిన దరఖాస్తులపై ప్రభుత్వ నియమ నిబంధనలకులోబడి పరిష్కార దిశగా చర్యలు తీసుకుoటున్నట్టు తెలిపారు. ప్రజా సమస్యలే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని. ప్రజలు అందించిన దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి వారి సమస్య నిజమైనదా కాదా అనే విషయాన్ని పరిశీలించి లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్నారు
డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.