ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజావాణి

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజావాణి

జిల్లా సమగ్ర అభివృద్ధి జిల్లా ప్రజల సంక్షేమం సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయం సూపర్డెంట్ విశ్వ ప్రసాద్, డిఏ ఓ రాజు ప్రజల నుండి ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించారు.

గత వారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టరేట్ సూపర్డెంట్ సూచించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 25 దరఖాస్తులు రాగా జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు జిల్లా అధికారులు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post