ప్రజలు పలు సమస్యల పై అందచేసిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా భూ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని, ప్రజావాణిలో వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులను పరిష్కార దిశగా సత్వరమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు . ప్రజా సమస్యలపై ఏర్పాటు చేసే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పక హాజరు కావాలని అలాగే కరోనా నేపథ్యంలో అన్ని కార్యాలయాలు పరిశుభ్రoగా ఉంచుకోని ఉద్యోగులు మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్రజావాణిలో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు 28, వివిధ శాఖలకు సంబంధించి 16 మొత్తం 44 దరఖాస్తులు అందాయని అన్నారు.
ఈ సమావేశంలో పి.డి. జ్యోతి పద్మ, శంకర్, దయానంద రాణి, డి.యo రాంపతి, డి.యస్.ఓ విజయ లక్ష్మి, పర్యవేక్షకులు సుదర్శన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు.

