ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 61 మంది సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను వారు స్వీకరించారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను వారు ఆదేశించారు.

ఈ ప్రజావాణి లో జిల్లా రెవెన్యూ అధికారి జగదీశ్వర్ రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post