ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి – అదనపు కలెక్టర్ రమేష్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి – అదనపు కలెక్టర్ రమేష్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం చేపట్టబడిందని, అధికారులు ఇట్టి ప్రాధాన్యతను గుర్తించి తక్షణమే సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి 32 వినతులు వచ్చాయి. అందులో ప్రధానంగా భూ సమస్యలకు సంబంధించి 20 విజ్ఞప్తులు రాగా, సదరం సర్టిఫికెట్, మూడు చక్రాల బ్యాటరీ సైకిల్, కృత్రిమ కాలు కావాలని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తదితర 12 విజ్ఞప్తులు వచ్చాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ భూ సమస్యలకు సంబంధించి ఆయా మండల తహసీల్ధార్లకు విజ్ఞప్తులు అందించాలని, అక్కడ పరిష్కారం కానిపక్షంలో ఇక్కడకు రావాలని, అనవసరంగా వ్యయ ప్రయాసాలకు గురికావద్దని ఫిర్యాదీదారులకు విజ్ఞప్తి చేశారు. అధికారులు కూడా తమ పరిధిలోనే పరిష్కరింపదగ్గ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కానీ పక్షంలో అట్టి సమస్య పరిష్కారానికి మార్గం చూయించాలని అన్నారు. ఈ సందర్భంగా వచ్చిన విజ్ఞప్తులను ధరణి, జిల్లా పంచాయతీ అధికారి, డి.ఆర్.డి.ఓ. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, మునిసిపల్ కమీషనర్ అధికారులకు తగు చర్య నిమిత్తం పంపారు.ప్రజావాణిలో వచ్చిన కొన్ని సమస్యలు ఇలా..
అల్లాదుర్గ్ మండలం గాండ్ల బావి తండా లోని సర్వే నెంబర్ 436/10/4 లో గల 1. 24 గుంటల భూమిని 1954 నుండి సాగు చేస్తుండగా ధరణిలో 425/ఉ గా చూపిస్తున్నదని అది మా తల్లి గారి పేర చూయిస్తున్నందున మా భూమే అని ఏం.పి .పి అధ్యక్షులు ఈర్ల అనిల్ కుమార్ రెడ్డి గిరిజనులమైన మా పై దౌర్జన్యం చేస్తున్నారని న్యాయం చేయవలసినదిగా రాత్ల సుమన్ నాయక్ ఫిర్యాదు చేయగా తగు సర్వే చేయవలసినదిగా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏ.డి. కి సూచించారు.
*ఘనపూర్ మండలం లింగసానిపల్లి కి చెందిన తారీ తన భర్త చనిపోయాడని పింఛను ఇప్పించవలసిందిగా కోరారు.
* శంకరంపేట్ మండలం ఖాజాపూర్ కు చెందిన కర్రే ప్రసాద్ తాను ఈ.యెన్.టి. వంద శాతం వికలాంగుడనని పింఛనుకై సదరం సర్టిఫికెట్ ఇప్పించవలసిందిగా కోరారు.
*హవేళిఘనాపూర్ మండల్ ఔరంగాబాద్ తండా కు చెందిన భాబ్య తాను ఇంటర్ వరకు చదివానని పేదరికంలో ఉన్న తనకు ఉద్యోగం ఇప్పించవలసిందిగా కోరారు.
*కూచన్ పల్లి లోని 9వ వార్డులో రోడ్డు కోసం వదిలిన స్థలంలో అక్రమంగా ఇంటి నిర్మాణం గావిస్తున్న ఖురేషి జుబేర్,ఖురేషీ తాసిమ్ ల పై చర్య తీసుకోవలసిందిగా ఆ వార్డు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.
*మెదక్ పట్టణంలో నిర్వహించుకుంటున్న మిర్చి షాపు నుండి ఇబ్బండలేదురావుతున్నాయని, షాపును తొలగించవలసినదిగా సూర్య సౌండ్ వారు మమ్మల్ని తిడుతున్నారని, మాకు ఈ షాపు ఒక్కటే ఆధారమున్నందున సహకరించవలసినదిగా ఆశమ్మ అభ్యర్థించగా తగు చర్య తీసుకోవలసినదిగా మునిసిపల్ కమీషనర్ కు సూచించారు.
*మెదక్ పట్టణంలోని దయారా వీధి వార్డు నెంబర్ 25 లో ప్రభుత్వం కట్టించిన ఇళ్లలో ఉంటున్న మా స్థలాలను పంపరి శివాజీ ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆ వార్డుకు చెందిన బడుగు వర్గాల వారు విజ్ఞప్తి చేయగా పరిశీలించి తగు న్యాయం చేయవలసినదిగా మునిసిపల్ కమీషర్ కు సూచించారు.
*తాగుడుకు బానిసైన నా భర్తకు పిల్లలతో పాటు దూరంగా ఉంటున్న నాకు తెలియకుండా నా భర్త 1 .26 ఎకరాల భూమిని అమ్ముకుంటున్నారని, తనకు న్యాయం చేయవలసినదిగా టేక్మాల్ మండలం బర్దీపూర్ కు చెందిన తులసమ్మ వేడుకొన్నారు.
*తూప్రాన్ మండలంలోని దాతార్ పల్లి లో సర్వే నెంబర్ 64/aa మరియు 65,66 లో గౌడ సంఘానికి చెందిన భూమిని కొందరు అక్రమంగా అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని, అట్టి భూమిని కాపాడవలసినదిగా సంఘం సభ్యులు కోరగా తూప్రాన్ తహశీల్ధార్ కు తగు చర్య తీసుకోవలసిందిగా అదనపు కలెక్టర్ రమేశ్ సూచించారు.
* చేగుంట మండలం వల్లభాపుర్ గ్రామాం మల్లికార్జున స్వామి దేవాలయానికి సంబంధించిన భూమి సర్వే నెంబర్ 209/1ఆ, 209/1ఇ , 209/1ఆ ను బత్తుల లింగయ్య ఆక్రమించుకున్నారని, సర్వే చేసి భూమిని కాపాడవలసినదిగా యాదవ సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు.
*సర్వే నెంబరు 592/ఈ లో ఉన్న పదిన్నర గుంటల భూమి వేరే పేరున చూయిస్తున్నధని , మాపై మార్చివలసినదిగా రామాయంపేట కు చెందిన గగులోత్ స్వరూప కోరగా, నా భూమి పై ఇంతవరకు పట్టా పాస్ బుక్ రాలేదని ఇప్పించవలసినదిగా కౌడిపల్లి మండలం రాజిపేట్ కు చెందిన గాండ్ల దుర్గయ్య విజ్ఞప్తి చేశారు.
*తన అనుమతి లేకుండా మరొకరి పేర భూమి రిజిస్ట్రేషన్ చేసిన వారిపై చర్య తీసుకొని నా భూమి ఇప్పించవలసిందిగా తూప్రాన్ మండలం నాగులపల్లి కి చెందిన మహంకాళి మైసమ్మ కోరగా నా భూమిని పట్టాదార్ పాస్ బుక్ లో నమోదు చేయవలసినదిగా రేగోడ్ మండలం మర్పల్లికి చెందిన పన్యాల పాపయ్య కోరారు. వారసత్వంగా రావలసిన 14 గుంటల భూమి బబ్బూరి వెంకటేశం కబ్జా చేశారని, సర్వే చేసి హద్దులు చూపించవలసినదిగా శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన కమ్మరి పండరయ్య విజనపతి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషద్ సీఈఓ శైలేష్, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు గంగయ్య, నీటిపారుదల శాఖా ఈఈ శ్రీ నివాసరావు, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కృష్ణ మూర్తి, కలెక్టరేట్ ఏ.ఓ. మన్నన్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post