ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి

వరంగల్

ప్రచురునార్ధం

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి

ప్రజావాణి కార్యక్రమానికి 45 ఆర్జీలు
జిల్లా కలెక్టర్ డాక్టర్ బి . గోపి

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. గోపి అన్నారు.

సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 45
దరఖాస్తులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. గోపి స్వీకరించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులకు అక్కడికక్కడే పరిష్కారం చూపే దిశగా, సంబంధిత శాఖల అధికారులకు నేరుగా అర్జీలను ఇస్తూ సమస్యలను గురించి అడిగి తెలుసుకుంటు, వాటిని పరిష్కారించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కొరకు పెట్టుకున్న ఆర్జీలకు అధికారులు ప్రాదాన్యం ఇచ్చి వెనువెంటనే పరిష్కరించే దిశగా కృషిచేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ లు అశ్విని తానాజీ, శ్రీ వాత్స, వివిధ శాఖలకి చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు

Share This Post