ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికై అధికారులు పనిచేయాలి :: జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికై అధికారులు పనిచేయాలి :: జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచారణార్థం

సోమవారం కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అభిలాష అభినవ్ తో కలిసి ప్రజల నుండి వారి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవిన్స్ కు సంబంధించి మండలాల వారీగా ప్రతి ఒక్క అధికారి రిజిస్టర్ ను నిర్వహించాలని మండలాల వారీగా ప్రతి వారం ఎన్ని దరఖాస్తులు అందుతున్నాయి వాటిని ఎంత వరకు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టినాము అన్న వివరాలను తెలుపగలగాలని భాద్యతారాహిత్యంగా వ్యవహరించరాదని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గార్ల మండలం పీక్లి తండా గ్రామానికి చెందిన జాటోతు సంతోష్ కుమార్ 133/ఆ,153/ఆ లో తమకు వారసత్వంగా, వారి నాన్నమ్మ పోషణ కోసం సంక్రమించిన 0.28 గుంటలన్నర భూమి వారి తాతగారు నిరక్షరాస్యత వల్ల పట్టా చేసుకోలేదని, రెవెన్యూ అధికారులు సర్వే చేసి ప్రభుత్వం నుండి పాసుపుస్తకము ఇప్పించగలరని కోరారు.

తొర్రూరు మండలం హరిపిరాల గ్రామానికి చెందిన తోట రాం మూర్తి హరిపిరాల గ్రామము నుండి చెర్లపాలెం వెళ్లే రహదారిలో కొందరు రైతులు SRSP కాలువ నీళ్ళను వారి పంట పొలాలకు తీసుకెళ్లేందుకు రహదారిని త్రవ్వి,వాహనాలు తిరగకుండా కబ్జా చేసి భయబ్రాంతులకు గురిచేసున్నారని, విచారణ జరిపించి తగు న్యాయం చేయాలని కోరారు.

గూడూరు మండలం భూపతి పేట గ్రామానికి చెందిన వి.అమరేందర్ రెడ్డి గ్రామ శివారులోని సర్వే నెం.80 లోని 0.9 గుంటల తన భూమి వేరొకరి పేరుపై పట్టా అయి ఉన్నదని అట్టి భూమిని సవరించి నా పాసుపుస్తకము లో నమోదు చేసి ఇప్పించుటకు కోరారు.

సీరోలు మండలం అంధనాలపాడు గ్రామానికి చెందిన పి.అప్పారావు గ్రామానికి ఆనుకొని ఉన్న D B M 48 SRSP ఉపకాల్వ నిర్వహణ సరిగా లేక గ్రామంలోని నల్లకుంట, ముత్యాలమ్మ కుంట చెరువుల్లో కి వెళ్ళవలసిన కాల్వ నీరు వృధాఅవుతున్నవని,రైతుల పంట పొలాలపై ప్రవహించి పంట నష్టం వాటిల్లుతుందని కాల్వ మరమ్మతులు చేయించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అదే విధంగా అంధనాలపాడు గ్రామము నుండి సీరోలు మండలానికి వెళ్లేందుకు వేరే మార్గం గుండా 7,8 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడం జరుగుతుందని, మండలానికి నేరుగా వెళ్లేందుకు కాగి చెరువుకట్ట పై రోడ్డును మంజూరి చేపించి అంధనాలపాడు, మోదుగ్గడ్డ గ్రామపంచాయతీలకు మండలానికి వెళ్ళే మార్గాన్ని దగ్గరగా చేయాలని కోరారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఏవిధంగా అయితే ప్రజావాణి నిర్వహిస్తున్నామో అదేవిధంగా మండల స్థాయిలో ప్రజావాణిలో మండల అధికారులందరు పాల్గొని ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని,ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని సూచించారు. గ్రీవిన్స్ నిర్వహణ కు సంబంధించి మండలాల్లో పత్రికా ప్రకటన ద్వారా సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మండలాలకు సంబంధించిన గ్రీవెన్స్ దరఖాస్తుల స్థితిని అడిగి తెలుసుకుని ప్రతి అధికారి జిల్లాలో, మండలాలలో గ్రీవిన్స్ దరఖాస్తులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేపించాలని, పెండింగ్ దరఖాస్తులు లేకుండా చూసుకోవాలని, ఏమైనా పరిష్కారం కాని సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.మనఊరు-మనబడిమోడల్ స్కూల్ పై కాకుండా ఇతర పాఠశాల లపై అధికారులు దృష్టి సారించాలని,
రానున్న పదవ తరగతి వార్షిక పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన వసతుల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. పట్టణంలో బొడ్రాయి పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు గాను మున్సిపల్ కమిషనర్ ను, సిబ్బందిని అభినందించారు.

అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మాట్లాడుతూ ప్రత్యేక అధికారులు మండలాలలో ప్రతి గ్రామ పంచాయతీలలో వేయింగ్ పరికరాలు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆర్టిఏ సూచిక బోర్డు ఉండాలని అన్నారు.

ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో (65) దరఖాస్తులను కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులకు తగు చర్యలకై పరిష్కారం కొరకు ఆదేశించారు.

Share This Post