ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి ……. అదనపు కలెక్టర్ వీరారెడ్డి

 

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి
……. అదనపు కలెక్టర్ వీరారెడ్డి

ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి పేర్కొన్నారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి ఆయన అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి అందిన విజ్ఞప్తులను త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు చొరవ చూపాలని సూచించారు.

ప్రజావాణిలో సుమారు 70 మంది వివిధ సమస్యలకు సంబంధించి అర్జీలను అదనపు కలెక్టర్ కు అందజేశారు.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డి అర్ ఓ, వివిధ శాఖల అధికారులు,ఆర్జీ దారులు పాల్గొన్నారు.

..

Share This Post