ప్రచురణార్థం
మహబూబాబాద్ జనవరి 27.
ప్రణాళికతోనే అభివృద్ధి వేగవంతంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.
శుక్రవారం కలెక్టర్ కార్యాలయం (ఐడిఓసి)లో గ్రామపంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ (జిపిడిపి) పై 9 అంశాల కు సంబంధించిన 29 శాఖల లక్ష్యాల సాధింపు పై జిల్లా అధికారులు ఎంపీడీవోలు తో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అందులో భాగంగా 9 అంశాలతో గ్రామస్థాయిలో అన్ని విభాగాలను 100% పురోగతి సాధించేందుకు చర్యలు చేపట్టిందన్నారు.
9 అంశాలలో మొదటి అంశం పేదరికం లేని మెరుగైన జీవనోపాధి గ్రామంగాను, ఆరోగ్యవంతమైన గ్రామం రెండవదిగా, చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామం మూడవదిగా, నీరు సరిపోయే గ్రామం నాలుగోదిగా, పరిసరాల పరిశుభ్రత పచ్చదనం గ్రామంలో ఐదవది, ఆరవ అంశం గా స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు, ఏడవ అంశం సామాజిక న్యాయం, ఎనిమిదవ అంశం గుడ్ గవర్నెన్స్, 9వ అంశంగా మహిళా స్నేహపూర్వక గ్రామంగా తీసుకోవడం జరిగిందన్నారు.
పై పేర్కొన్న తొమ్మిది అంశాలలో 29 శాఖలకు సంబంధించిన పథకాలు ఉన్నాయని పేర్కొన్నారు ఆయా శాఖల సమన్వయంతో అభివృద్ధి సాధించవలసిన అవసరం ఉందని అధికారులు ఆ దిశగా కృషి చేయాలన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో సమగ్ర అభివృద్ధి కొరకు విద్య వైద్యం తో పాటు, ఆయుర్వేదం త్రాగునీరు నిత్యవసర వస్తువుల పంపిణీ విద్యుత్తు వ్యవసాయం పశుసంవర్ధకం ఉద్యానవనం పరిసరాల పరిశుభ్రత పచ్చదనం పారిశుధ్యం మెరుగు ఉపాధి హామీ పెన్షన్స్ స్వయం సహాయక సమృద్ధి మార్కెటింగ్ వంటి పలు అంశాలను పరిగణలోనికి తీసుకొని 100% లక్ష్యాలు సాధించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.
సబ్ కి యోజన సబ్కా వికాస్ అనే నినాదంతో స్థానిక సంస్థలను బలోపేతం చేయటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అన్నారు.
సంబంధిత అధికారులు అందరూ అందుకు తగినట్లుగా ప్రణాళికలోని అంశాల శాఖల సిబ్బందిని సమన్వయ పరుస్తూ ప్రగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు అందుకు లక్ష్యాలు రూపొందించుకోవాలని నిర్ణీత వ్యవధిలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ జడ్పీ సీఈవో రమాదేవి జిల్లా పంచాయతీ అధికారి ధన్ సింగ్, డి ఆర్ డి ఓ సన్యాసయ్య జిల్లా అధికారులు మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు సిడిపివోలు తదితరులు పాల్గొన్నారు.