ప్రణాళికాబద్దంగా అభివృద్ది పనులను పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి
ప్రచురణార్థం—2 తేది.12.8.2021
ప్రణాళికాబద్దంగా అభివృద్ది పనులను పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల , ఆగస్టు 12:- ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ది పనులను ప్రణాళికాబద్దంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ధర్మపురి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ది పనులు, ధర్మపురి ఆలయ అభివృద్ది పనులు తదితర అంశాల పై కలెక్టర్ సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ధర్మపురి పరిధిలో పంచాయతి రాజ్, మున్సిపాల్టీ, ఆర్ అండ్ బీ కింద మంజూరు చేసిన రొడ్డు నిర్మాణ పనులు, ప్రారంభించిన పనులు , వాటి స్థితిగతుల పై వివరాలు తెలుసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో ధర్మపురి పట్టణంలో 2.9 కిమి మేర మేజర్ రొడ్డు పనులు చేపడుతున్నామని కలెక్టర్ కు అధికారులు తెలిపారు. ధర్మపురి పట్టణంలో రొడ్డు వెడల్పు పనులలో ఎదురవుతున్న ఇబ్బందులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. ధర్మపురి అభివృద్ది పనుల పురొగతి పై ప్రతి వారం రివ్యూ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ధర్మపురి పరిధిలో ఉన్న దళితవాడలు, ఎస్సి కాలనీలో ఉన్న మౌలిక సదుపాయాల పై నివేదిక సిద్దం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరఫరా చేయడానికి వేసిన పైప్ లైన్, ట్యాపులు తదితర అంశాలు పరిశీలించాలని, మరమ్మత్తుకు గురైన వాటి స్థానంలో నూతనంగా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చెయాలని కలెక్టర్ తెలిపారు. ధర్మపురి పరిధిలో పెండింగ్ లో ఉన్న మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం ధర్మపురి ఆలయ అభివృద్ది పనుల పై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ది పనులకు సంబంధించి పరిపాలనా అనుమతి మంజూరు చేసారని, టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ది పనులకు సంబంధించి రూ.46.65 కోట్ల నిధులతో ప్రతిపాదనలు సిద్దం చేసామని కలెక్టర్ తెలిపారు. ఆలయ ఆర్చరీ, స్టాట్యూ, ప్లావర్ గార్డెన్ మొదలగు అభివృద్ది పనులకు కొంత భూ సేకరణ చేయాల్సి ఉందని ఆర్డిఒ తెలిపారు. ఆలయ అభివృద్దికి అవసరమైన అభివృద్ది పనులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ధర్మపురి పట్టణ పరిధిలో రూ.7.4 కోట్లతో సిసిరొడ్ల నిర్మాణం, డ్రైనేజి నిర్మాణం, రొడ్డు నిర్మాణ వైడెనింగ్, లైటింగ్ మొదలగు పనులు చేపట్టామని అధికారుల తెలిపారు. సకాలంలో అభివృద్ది పనులు పూర్తి చెయాలని కలెక్టర్ సూచించారు. ధర్మపురి పట్టణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి సుందరీకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కమలాపూర్ గ్రామ శివారులో గుట్ట వద్ద సిపిడబ్ల్యూఎస్ నిధులతో నిర్మించిన నీటి శుద్దికారణ ప్లాంటును సందర్శించి దానిని వాడుకలోకి తీసుకొనిరావడానికి మరమ్మతుల వివరాలను మిషన్ భగీరథ ఈ ఈ నుండి అడిగి తెలుసుకుని పరిసరాలను పైప్ లైన్ , యంత్రాలను పరిశీలించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారి, వివిధ శాఖల అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.
ప్రణాళికాబద్దంగా అభివృద్ది పనులను పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి
