ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలు :: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—-2

తేదీ.23.5.2022

ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలు :: జిల్లా కలెక్టర్ జి.రవి

పకడ్బందీగా 10వ తరగతి పరీక్షల నిర్వహణ

మన ఊరు మన బడి కార్యక్రమ గ్రౌండింగ్ ఆలస్యం కాకుండా చర్యలు

పెండింగ్ దళిత బంధు యూనిట్లు త్వరితగతిన గ్రౌండ్ చేయాలి

100% ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయాలి

గ్రామ పంచాయతీల్లో సకాలంలో లేఔట్లకు అనుమతి

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

మన ఊరు మన బడి కార్యక్రమం అమలు , దళిత బంధు మొదలైన ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ పై అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్

జగిత్యాల మే 23:- జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సూచించారు.

మన ఊరు మన బడి, దళిత బంధు పథకం, మొక్కల సంరక్షణ, 10వ తరగతి పరీక్షలు, మొదలైన ప్రభుత్వ కార్యక్రమాల పై కలెక్టర్ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రం పరిసరాల పారిశుధ్యం మెరుగు పరచాలని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

మన ఊరు మన బడి కార్యక్రమం శుక్రవారం సమావేశం నిర్వహించామని, సోమవారం నాటికి 7 అదనపు ప్రాజెక్టుల రూపకర్త పూర్తిచేశారని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ప్రధానోపాధ్యాయుల వద్ద 21 పాఠశాలల ప్రాజెక్టు పనులు, డీఈల వద్ద 27 పాఠశాల ప్రాజెక్టు పనులు, ఈఈల వద్ద 7 పాఠశాల ప్రాజెక్ట్ పనులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పూర్తి చేసి ప్రాజెక్టు రూపకల్పన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

మన ఊరు మన బడి కింద ప్రాజెక్టు పూర్తయిన పాఠశాలలకు సంబంధించి నిధులు విడుదల చేశామని, పనులు గ్రౌండ్లో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే తో సమన్వయం చేసుకొని పనులు త్వరగా గ్రౌండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో 345 దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 245 యూనిట్లను క్షేత్రస్థాయిలో గ్రౌండ్ చేశామని, రేపు కోరుట్ల నియోజకవర్గంలో మరో 40 యూనిట్ లో గ్రౌండ్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. మండలాల వారీగా క్షేత్రస్థాయిలో సర్వీస్, రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ , వ్యవసాయ సెక్టార్ లో గ్రౌండ్ పురోగతిపై ప్రతిరోజు నివేదికలు తెప్పించుకోవాలని, బ్యాంకుల నుండి నిధుల ఉపసంహరణకు ఎప్పటికప్పుడు అనుమతులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

మున్సిపాలిటీలో 100% ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయాలని, పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ టాక్స్ వసూలు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో, మున్సిపాలిటీ లో ఆస్తి పన్ను వసూలు పై కలెక్టర్ చర్చించారు. ప్రభుత్వ విభాగాలు పూర్తిస్థాయిలో విద్యుత్, ప్రాపర్టీ టాక్స్ బిల్లులు చెల్లింపు పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా గ్రామ పంచాయతీ పరిధిలో రూ.4 లక్షల ప్రాపర్టీ టాక్స్ పెండింగ్ జనరల్ ఫండ్ నుంచి చెల్లింపు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ప్రతివారం జిల్లాలో భవన నిర్మాణ అనుమతుల పై పర్యవేక్షించాలని, అక్రమ లే అవుట్లను ఎప్పటికప్పుడు తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. అక్రమ లేఅవుట్ల పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు , ఇతర అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.జిల్లాలో ఉన్న అక్రమ లేఅవుట్ల పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, జిల్లావ్యాప్తంగా గ్రామాల వారీగా మున్సిపాలిటీల వారీగా అక్రమ లేఅవుట్లు జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం అందించిన అనుమతుల డివియెట్ చేస్తున్న నిర్మాణాలను నిర్ధాక్షణ్యంగా కూల్చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

జిల్లాలో ఇప్పటి వరకు 60% దాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేశామని, ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో 68% మాత్రమే ట్యాబ్ ఎంట్రీ ఉండటం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు, రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రతి రకమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలోని రైస్ మిల్లు వద్ద దాన్యం సకాలంలో అన్ లోడింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ధాన్యం నాణ్యతపై వ్యవసాయ విస్తరణాధికారి కేంద్రాల నిర్వాహకులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. సన్నరకం ధాన్యం కొనుగోలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల రిజెక్ట్ చేయవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. జక్క సాగర్ ఇబ్రహీంపట్నం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యం కొనుగోలు చేయక పోవడానికి గల కారణాలు పై నివేదిక తయారుచేసి సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

మున్సిపాలిటీలకు సమీపంలో ఉన్న చెరువుల ఎఫ్.టి.ఎల్ లెవెల్ నమోదు చేయాలని,ప్రతి మండలంలో కనీసం 2 గ్రామీణ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు స్థలాలను జూన్ రెండు లోపు గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ లో ఉన్న ఈ-ఆఫిస్ ఫైళ్ళు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ- ఆఫీస్ ద్వారానే ఫైల్ మూమెంట్ ఉండాలని తెలిపారు.8వ విడత హరితహారం కార్యక్రమం అమలుకు పక్కా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ సూచించారు

అదనపు కలెక్టర్ బి.ఎస్ .లత , ఇంచార్జి ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ,జగిత్యాల ఆర్.డి.ఓ., జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది

ప్రచురణార్థం----2 తేదీ.23.5.2022 ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలు :: జిల్లా కలెక్టర్ జి.రవి పకడ్బందీగా 10వ తరగతి పరీక్షల నిర్వహణ మన ఊరు మన బడి కార్యక్రమ గ్రౌండింగ్ ఆలస్యం కాకుండా చర్యలు పెండింగ్ దళిత బంధు యూనిట్లు త్వరితగతిన గ్రౌండ్ చేయాలి 100% ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయాలి గ్రామ పంచాయతీల్లో సకాలంలో లేఔట్లకు అనుమతి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి మన ఊరు మన బడి కార్యక్రమం అమలు , దళిత బంధు  మొదలైన ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ పై అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జగిత్యాల మే 23:- జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సూచించారు. మన ఊరు మన బడి, దళిత బంధు పథకం, మొక్కల సంరక్షణ, 10వ తరగతి పరీక్షలు, మొదలైన ప్రభుత్వ కార్యక్రమాల పై కలెక్టర్ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.  10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రం పరిసరాల పారిశుధ్యం మెరుగు పరచాలని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.  మన ఊరు మన బడి కార్యక్రమం శుక్రవారం సమావేశం నిర్వహించామని, సోమవారం నాటికి 7 అదనపు ప్రాజెక్టుల రూపకర్త పూర్తిచేశారని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ప్రధానోపాధ్యాయుల వద్ద 21 పాఠశాలల ప్రాజెక్టు పనులు, డీఈల వద్ద 27 పాఠశాల ప్రాజెక్టు పనులు, ఈఈల వద్ద 7 పాఠశాల ప్రాజెక్ట్ పనులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పూర్తి చేసి ప్రాజెక్టు రూపకల్పన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  మన ఊరు మన బడి కింద ప్రాజెక్టు పూర్తయిన పాఠశాలలకు సంబంధించి నిధులు విడుదల చేశామని, పనులు గ్రౌండ్లో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే తో సమన్వయం చేసుకొని పనులు త్వరగా గ్రౌండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  జిల్లాలో 345 దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 245 యూనిట్లను క్షేత్రస్థాయిలో గ్రౌండ్ చేశామని, రేపు కోరుట్ల నియోజకవర్గంలో మరో 40 యూనిట్ లో గ్రౌండ్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. మండలాల వారీగా క్షేత్రస్థాయిలో సర్వీస్, రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ , వ్యవసాయ సెక్టార్ లో గ్రౌండ్ పురోగతిపై ప్రతిరోజు నివేదికలు తెప్పించుకోవాలని, బ్యాంకుల నుండి నిధుల ఉపసంహరణకు ఎప్పటికప్పుడు అనుమతులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  మున్సిపాలిటీలో 100% ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయాలని, పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ టాక్స్ వసూలు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో, మున్సిపాలిటీ లో ఆస్తి పన్ను వసూలు పై కలెక్టర్ చర్చించారు. ప్రభుత్వ విభాగాలు పూర్తిస్థాయిలో విద్యుత్, ప్రాపర్టీ టాక్స్ బిల్లులు చెల్లింపు పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా గ్రామ పంచాయతీ పరిధిలో రూ.4 లక్షల ప్రాపర్టీ టాక్స్ పెండింగ్ జనరల్ ఫండ్ నుంచి చెల్లింపు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతివారం జిల్లాలో భవన నిర్మాణ అనుమతుల పై పర్యవేక్షించాలని, అక్రమ లే అవుట్లను ఎప్పటికప్పుడు తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. అక్రమ లేఅవుట్ల పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు , ఇతర అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.జిల్లాలో ఉన్న అక్రమ లేఅవుట్ల పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, జిల్లావ్యాప్తంగా గ్రామాల వారీగా మున్సిపాలిటీల వారీగా అక్రమ లేఅవుట్లు జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం అందించిన అనుమతుల డివియెట్ చేస్తున్న నిర్మాణాలను నిర్ధాక్షణ్యంగా కూల్చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.  జిల్లాలో ఇప్పటి వరకు 60% దాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేశామని, ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో 68% మాత్రమే ట్యాబ్ ఎంట్రీ ఉండటం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు, రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రతి రకమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  జిల్లాలోని రైస్ మిల్లు వద్ద దాన్యం సకాలంలో అన్ లోడింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.  ధాన్యం నాణ్యతపై వ్యవసాయ విస్తరణాధికారి కేంద్రాల నిర్వాహకులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. సన్నరకం ధాన్యం కొనుగోలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల రిజెక్ట్ చేయవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. జక్క సాగర్ ఇబ్రహీంపట్నం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యం కొనుగోలు చేయక పోవడానికి గల కారణాలు పై నివేదిక తయారుచేసి సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.  మున్సిపాలిటీలకు సమీపంలో ఉన్న చెరువుల ఎఫ్.టి.ఎల్ లెవెల్ నమోదు చేయాలని,ప్రతి మండలంలో కనీసం 2 గ్రామీణ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు స్థలాలను జూన్ రెండు లోపు గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ లో ఉన్న ఈ-ఆఫిస్ ఫైళ్ళు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ- ఆఫీస్ ద్వారానే ఫైల్ మూమెంట్ ఉండాలని తెలిపారు.8వ విడత హరితహారం కార్యక్రమం అమలుకు పక్కా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ సూచించారు అదనపు కలెక్టర్ బి.ఎస్ .లత , ఇంచార్జి ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ,జగిత్యాల ఆర్.డి.ఓ., జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది
ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలు :: జిల్లా కలెక్టర్ జి.రవి

Share This Post