ప్రణాళికాబద్ధంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

పత్రికాప్రకటన..1 తేదిః 30-09-2021
ప్రణాళికాబద్ధంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల సెప్టెంబర్ 30:- జిల్లాలో అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసి ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయుటకై చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ గురువారం ఎం.పి.డి.ఓ.లు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్ లు మరియు మండల ప్రత్యేక అధికారులతో జూమ్ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో తెలుపు రేషన్ కార్డుల ప్రకారం 18 మండలాల్లోని 380 గ్రామాల్లో ఉన్న 18 సంవత్సరాలు నిండిన 382403 మహిళలందరికి తెలంగాణ ప్రభుత్వం ద్వారా బతుకమ్మ కానుకగా చీరల పంపిణి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పండుగ బతుకమ్మ నాడు పేదింటి ఆడపడుచుల అందరికీ చీరలను కానుకగా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శి, రేషన్ షాపు డీలర్, గ్రామ సమైక్య కమిటీ సభ్యులు మరియు మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూశాఖ, మెప్మా సిబ్బంది మొదలగు వారితో కలిసి పంపిణి చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 18 సంవత్సరాల నిండిన మహీళలందరు ఆధార్ కార్డు లేదా ఇతర ఫోటో ఐడెంటికార్డ్ ద్వారా గుర్తించి మహిళలు పంపిణి చేసే బతుకమ్మ చీరలు తీసుకోవాలని కోరారు. 60 సంవత్సరాలు నిండిన పెద్ద మనుషులకు 9 మీటర్లు మరియు ఇతరులకు 6 మీటర్ల చీరల పంపిణి చేయబడుతుందని, ఎక్కడైనా చీరలు డ్యామేజిలు ఉంటే ముందుగానే గుర్తించి వాటిని మార్చాలని తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతం చేయవలసిందిగా సంబంధిత అధికారకు కలెక్టర్ సూచించారు.

ప్రణాళికాబద్ధంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి , తహసిల్దార్లు, ఎం.పి.డి.ఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమీక్ష లో పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారి చేయబడినది.

Share This Post