*ప్రణాళికాబద్ధంగా విద్యాసంస్థలలో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి::జిల్లాకలెక్టర్ జి.రవి*

*ప్రణాళికాబద్ధంగా విద్యాసంస్థలలో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి::జిల్లాకలెక్టర్ జి.రవి*

ప్రచురణార్థం—2

తేదీ.24.8.2021

*ప్రణాళికాబద్ధంగా విద్యాసంస్థలలో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి::జిల్లాకలెక్టర్ జి.రవి**ప్రణాళికాబద్ధంగా విద్యాసంస్థలలో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి::జిల్లాకలెక్టర్ జి.రవి*

జగిత్యాల, ఆగష్టు 24:- సెప్టెంబర్ 01 నుండి పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలలో పారిశుద్ధ్య పనులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సంభదిత అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి వీడియోకాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి తరగతిలో శానిటైజర్ ఏర్పాటు చేయాలని, ప్రతి పాఠశాలకు మంచి నీటి సౌకర్యం ఇతర మౌలికసదుపాయాలను ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ సౌకర్యం లేనట్లయితే పునరుద్దరించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.

పాఠశాలలోని ఫర్నీచర్ను, పరిసరాలను శుభ్రం చేయించాలని , పాఠశాలల్లోని నీటి సంపులను, ట్యాంకులను శుభ్రపరచాలన్నారు. తరగతి గదులను శానిటైజషన్ చేయాలని, మధ్యాహ్న భోజనం మరియు వసతి గృహాలలో నూతన బియ్యం, సరుకులను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. విద్యార్థులకు ఎవరికైనా జ్వరం , కరోనా లక్షణాలు కనిపిస్తే సిక్ రూమ్ ఏర్పాటు చేసి వైద్యాధికారులకు తెలియజేయాలని అన్నారు. మండల స్థాయిలో ఎం.పీ.ఓ, ఎంపీడీఓ, ఎం.ఈ.ఓలు మరియు గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్ , పంచాయతీ సెక్రటరీ కమిటీలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. చెక్ లిస్ట్ ప్రకారం ప్రతి పాఠశాలలో పారిశుధ్య పనులను చేపట్టి నివేదిక తయారు చేసి పంపాలని ఆదేశించారు. ప్రతి తరగతిలో విద్యార్థులు మాస్కులు ధరించేలా చూడాలని, సామజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ , జడ్పి సీఈఓ , జిల్లా విద్యాశాఖ అధికారి , డీపీఓ , ఎస్సి, బీసీ , మైనారిటీ వెల్ఫేర్ అధికారులు, సివిల్ సప్ప్లై అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి, ఎం.పి.డి.ఓ.లు., ఎం.పి.ఓలు. ఎం.ఈ.ఓలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల జిల్లా గారిచే జారీ చేయనైనది.

Share This Post