ప్రణాళికాబద్ధంగా సీజనల్ వ్యాధులు నియంత్రణకు చర్యలు చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రణాళికాబద్ధంగా సీజనల్ వ్యాధులు నియంత్రణకు చర్యలు చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—-2

తేదీ.18.8.2021

ప్రణాళికాబద్ధంగా సీజనల్ వ్యాధులు నియంత్రణకు చర్యలు చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల, ఆగస్టు 18:- జిల్లాలో ప్రణాళికబద్ధంగా సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు నియంత్రణపై సంబంధిత పంచాయతీ ,మున్సిపల్, వైద్య అధికారులతో బుధవారం జిల్లా కలెక్టర్ జూం కాన్ఫరెన్స్ నిర్వహించారు.ప్రస్తుతం మన జిల్లాలో 6 డెంగ్యూ కేసులో ఒక మలేరియా కేసులు ఉన్నాయని, 58 అనుమానితులను పరిరక్షించి ఫలితాల కోసం వేచి చూస్తున్నామని కలెక్టర్ తెలిపారు. డెంగీ , మలేరియా వ్యాధి నివారణకు కార్యాచరణ ప్రణాళికలతో వైద్యం, పంచాయతీ,మునిసిపల్ సిబ్బంది చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ప్రతి మంగళ,శుక్రవారాలలో జిల్లా వ్యాప్తంగా డ్రై డే నిర్వహించాలని, శానిటేషన్, ఫాగింగ్, స్ప్రెయింగ్ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. జిల్లాలో ఇండ్లలో ఉన్న నీటి నిల్వలను గుర్తించి మాపింగ్ చేయాలని, అనంతరం అక్కడ నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండల పరిషత్ అధికారులు , మండల ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించాలని అన్నారు. ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత , దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాలు మరియు పట్టణాల్లో కరపత్రాలు, చెత్త సేకరణ వాహనాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని, వైద్య సేవలు మరియు అనుమానితులనుండి రక్త నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపించాలని అన్నారు. జిల్లాలో ప్రతి రోజూ 100ఇండ్లను సర్వే చేయడానికి 10 మందిని నియమించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. డెంగ్యూ మలేరియా వచ్చిన వ్యక్తులకు పరిసర ప్రాంతాల్లో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా మలేరియా అధికారి, మునిసిపల్ కమిషనర్లు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది

ప్రణాళికాబద్ధంగా సీజనల్ వ్యాధులు నియంత్రణకు చర్యలు చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రణాళికాబద్ధంగా సీజనల్ వ్యాధులు నియంత్రణకు చర్యలు చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

Share This Post