ప్రణాళికాబద్ధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను నిర్వహించాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

ప్రణాళికాబద్ధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను నిర్వహించాలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

000000

     స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను జిల్లాలలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

     స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ పై హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించే కార్యక్రమాలకు జిల్లా స్థాయిలో కలెక్టర్లు పక్కా కార్యాచరణ సిద్దం చేసుకొవాలని సూచించారు. ఆగస్టు 10న ప్రతి గ్రామం, మున్సిపాలిటీ పరిధిలో ఫ్రీడం పార్క్ కింద కనీసం 75 మొక్కలు నాటాలని పేర్కొన్నారు. ఆగస్టు 11న ప్రతి మండల కేంద్రంలో ఫ్రీడం రన్, ఆగస్టు 12న జాతీయ సమైక్యత కోసం రక్షాబంధన్ నిర్వహణ, ఆగస్టు 13న ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీ లో జాతీయ జెండా, ఫ్లకార్డులతో విద్యార్థులు, ఉద్యోగులతో ఫ్రీడం ర్యాలీ నిర్వహించాలని, అనంతరం బేలూన్ లను గాల్లోకి వదలాలని తెలిపారు.  ఆగస్టు 14న ప్రతి నియోజకవర్గంలో జానపద కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని, 119 బృందాలు సిద్దం చేసి సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. ఆగస్టు 16న ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సామూహికంగా జాతీయ గీతాలాపన చేయాలని సీఎస్ పేర్కొన్నారు.ఆగస్టు 17న ప్రతి నియోజకవర్గంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలో ప్రతి గ్రామం పరిధిలో క్రీడా పోటీలు నిర్వహించాలని, ఆగస్టు 11,12 న గ్రామ స్థాయిలో, ఆగస్టు 13,14న మండల స్థాయిలో, ఆగస్టు 16,17న జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలని, ఆగస్టు 18న ఫ్రీడం కప్ పోటిలు నిర్వహించి విజేతలను నిర్ణయించాలని తెలిపారు. ఆగస్టు 19న జిల్లాలో ఉన్న ప్రతి వృద్ధాశ్రమం, ఆసుపత్రి, అనాథ శరణాలయంలో స్వీట్, పండ్లు పంపిణీ జరగాలని, ఆగస్టు 20న రంగోలి పోటీలు, ఆగస్టు 21న గ్రామ పంచాయతీ, మండల, జడ్పీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారంతో నివేదికలు పంపాలని ఆదేశించారు.

     ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే 2లక్షల జాతీయా జెండాలను స్వీకరించి , జాతీయ జెండాలను ఇంటింటా పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 9, 10, 11 తేదిలతో పాటు 16 నుండి 21వ తేది వరకు 30 వేలమంది పిల్లల కొరకు 13 సినిమా థియోటర్ల ద్వారా గాంధీ చిత్రాన్ని ప్రదర్శించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కోన్నారు. మంగళవారం రోజున 12 సినిమా థియోటర్ల ద్వారా 5268 పిల్లలకు గాంధీ సినిమాను పదర్శించడం జరిగిందని తెలిపారు. ప్రీడం రన్, ఫ్రిడం పార్క్ కార్యక్రమాల నిర్వహణ కొరకు ముందస్తుగానే పణాళికను సిద్దం చేసుకోవడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.

     అనంతరం జిల్లా కలెక్టర్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో మాట్లాడుతూ అధికారులు టీం వర్క్ తో పని చేసి వజ్రోత్సవాల ను విజయవంతం చేయాలన్నారు. ఆగస్టు 10న ప్రతి గ్రామం మున్సిపాల్టీలో ఫ్రీడమ్ పార్క్ లో 75 మొక్కలు నాటాలి అన్నారు. ఆగస్టు 11న అంబేడ్కర్ విగ్రహం నుండి ఆర్ట్ కళాశాల వరకు జరిగే ఫ్రీడం రన్ ను జిల్లాలో విజయవంతం చేయాలని అన్నారు. ఫ్రీడం పార్క్ లో బాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను, ఎస్.హెచ్.ఓ, యంపిడిఓ లను బాగస్వాములను చేయాలని, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇన్సిట్యూట్ లలో కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. 14వ తేదిన జానపద కళాకారులతో అమరవీరుల స్థూపం నుండి ఆడిటోరియం వరకు ర్యాలీని నిర్వహించి దేశభక్తి గీతాలను పాడించాలని అన్నారు. 15న ఫ్రిడం ఫైటర్లతో పాటు ఉత్తమ సేవలను అందిస్తున్న పలువురు ప్రముఖులను గుర్తించి వారికి మెమెంటోల ద్వారా సత్కరించాలని సూచించారు. 16న సామూహిక జాతీయాగీతాలపన కార్యక్రమంలో ప్రతిఒక్క పౌరుడు పాల్గోనేల చూడాలని, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతివార్డు వారిగా ఒక ప్రత్యేకాధికారిని ఏర్పాటు చేయాలని పేర్కోన్నారు. జిల్లాతొ పాటు అన్ని మున్సిపల్, మండలం మరియు గ్రామపంచాయితీలలో జాతీయ గీతాలాపనకు ఏర్పాట్లు చేయాలని, కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అక్కడ ఏర్పాట్లను పరిశీలించవలసిందిగా అధికారులను ఆదేశించారు. శాఖల వారిగా ప్రత్యేక శకటాలను తయారు చేయాలని, మెడికల్, ఫార్మసి, నర్సింగ్ కళాశాలల విద్యార్థులు కూడా కార్యక్రమంలో పాల్గోనే చూడాలని అన్నారు.

     ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ సత్యనారాయణ, ఆదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్ లాల్, మున్సిపల్ కమీషన్ సేవాఇస్లావత్, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్జన్ రావు, జిల్లా యవజన క్రీడల అభివృద్ది అధికారి రాజవీర్, డి ఆర్ డి ఓ శ్రీలతా , పిడి మెప్మా రవీందర్, స్త్రీ శిశు సంక్షేమాధికారి పద్మావతి, జిల్లా పంచాయితి అధికారి వీరబుచ్చయ్య, వ్యవసాయ శాఖ అధికారి శ్రీదర్, మున్సిపల్ కమీషనర్లు, ఇతర అధికారులు పాల్గోన్నారు.

Share This Post