ప్రణాళికాబద్ధంగా 8వ విడత హరితహారం కార్యక్రమం అమలు:: సీఎస్ సోమేష్ కుమార్

ప్రచురణార్థం—-1

తేదీ.29.4.2022

ప్రచురణార్థం----1 తేదీ.29.4.2022 ప్రణాళికాబద్ధంగా 8వ విడత హరితహారం కార్యక్రమం అమలు:: సీఎస్ సోమేష్ కుమార్ జగిత్యాల ఏప్రిల్ 29:-  జిల్లాలో  ప్రణాళికాబద్ధంగా 8వ విడత హరితహారం కార్యక్రమం అమలు చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హరితహారం, దళిత బందు, ధాన్యం కొనుగోలు, వ్యవసాయం వంటి పలు అంశాల పై శుక్రవారం సిఎస్ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  హరితహారం కార్యక్రమం నిర్వహణ పై ప్రతి జిల్లా తమ పరిధిలో ప్రణాళిక రూపొందించుకోవాలని, ఈ అంశంపై ప్రతి వారం కలెక్టర్ సమీక్ష నిర్వహించాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. జిల్లాలో ఉన్న నర్సరీలు, జరుగుతున్న ప్లాంటేషన్ ప్రక్రియను కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సి ఎస్ ఆదేశించారు. డివిజనల్ అటవీ అధికారులను హరితహారం కార్యక్రమం లో భాగస్వామ్యం చేయాలని, వారు మరింత చురుకైన పాత్ర ప్రదర్శించే దిశగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. జిల్లాలో హరిత హారం కింద నాటిన మొక్కల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రతివారం కనీసం 3 సార్లు మొక్కలకు వాటరింగ్ చేయాలని సూచించారు.గ్రామాల్లో ఉన్న పల్లె ప్రకృతి వనాల్లో పెద్ద ఎత్తున మొక్కలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులు, చెరువులు పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేయాలని ఆయన ఆదేశించారు.  జిల్లాలోని ప్రతి మండలంలో 5 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించామని, 8వ విడత హరితహారం లో లో మొక్కలు నాటేందుకు సిద్ధం కావాలని అన్నారు. జిల్లాలో మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.  అవసరమైన చోట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. రైతు వేదికలను సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకొని రావాలని ఆయన వ్యవసాయ అధికారులను ఆదేశించారు.  ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన గణాంకాల లో తెలంగాణ ప్రాంతంలో 6.88% గ్రీన్ కవర్ పెరిగిందని, దీనికి కృషి చేసిన అధికారులు ప్రభుత్వ సిబ్బంది ప్రజా ప్రతినిధులకు చీఫ్ సెక్రటరీ అభినందనలు తెలిపారు. ప్రతి రైతు వేదికలో అవగాహన కార్యక్రమాల షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని అన్నారు. దళిత బంధు పథకం కింద వ్యవసాయ శాఖ పరిధిలో ఏర్పాటు చేసే యూనిట్ల ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ప్రతి రైతు వేదిక లో ప్రతీ వారం కనీసం రెండు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి రవి మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో బృహత్ పల్లె ప్రకృతి వనాల స్థలాలు గుర్తించామని, మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని అన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ మొక్కల సంరక్షణ కోసం వాటరింగ్ చేపట్టామని తెలిపారు. జిల్లాలో 377 కిలోమీటర్ల మేర మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టామని, 8వ విడత కింద పెండింగ్ రోడ్లు , కేనాళ్ళు చుట్టూ పక్కల మొక్కలు నాటుటకు చర్యలు చేపడతామని తెలిపారు.  దళిత బంధు పథకం కింద 345 లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేశామని, 89 యూనిట్ల గ్రౌండింగ్ చేశామని, వాహనాల కొనుగోలు ఆర్డర్ ప్లేస్ చేశామని కలెక్టర్ తెలిపారు.  వ్యవసాయ విస్తరణ అధికారులను సమన్వయం చేసుకుంటూ రైతు వేదికలను ఆక్టివ్ గా ఉంచుతామని కలెక్టర్ అన్నారు. జిల్లాలో వరి కోత లకు అనుగుణంగా 54 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.  అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ , జిల్లా అటవీ అధికారి ,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి , జిల్లా అధికారులు సంబంధిత అధికారులు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.  జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల చేజారి చేయనైనది.
ప్రణాళికాబద్ధంగా 8వ విడత హరితహారం కార్యక్రమం అమలు:: సీఎస్ సోమేష్ కుమార్

జగిత్యాల ఏప్రిల్ 29:- జిల్లాలో ప్రణాళికాబద్ధంగా 8వ విడత హరితహారం కార్యక్రమం అమలు చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హరితహారం, దళిత బందు, ధాన్యం కొనుగోలు, వ్యవసాయం వంటి పలు అంశాల పై శుక్రవారం సిఎస్ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

హరితహారం కార్యక్రమం నిర్వహణ పై ప్రతి జిల్లా తమ పరిధిలో ప్రణాళిక రూపొందించుకోవాలని, ఈ అంశంపై ప్రతి వారం కలెక్టర్ సమీక్ష నిర్వహించాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. జిల్లాలో ఉన్న నర్సరీలు, జరుగుతున్న ప్లాంటేషన్ ప్రక్రియను కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సి ఎస్ ఆదేశించారు. డివిజనల్ అటవీ అధికారులను హరితహారం కార్యక్రమం లో భాగస్వామ్యం చేయాలని, వారు మరింత చురుకైన పాత్ర ప్రదర్శించే దిశగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.

జిల్లాలో హరిత హారం కింద నాటిన మొక్కల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రతివారం కనీసం 3 సార్లు మొక్కలకు వాటరింగ్ చేయాలని సూచించారు.గ్రామాల్లో ఉన్న పల్లె ప్రకృతి వనాల్లో పెద్ద ఎత్తున మొక్కలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులు, చెరువులు పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేయాలని ఆయన ఆదేశించారు.

జిల్లాలోని ప్రతి మండలంలో 5 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించామని, 8వ విడత హరితహారం లో లో మొక్కలు నాటేందుకు సిద్ధం కావాలని అన్నారు. జిల్లాలో మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.

అవసరమైన చోట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. రైతు వేదికలను సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకొని రావాలని ఆయన వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన గణాంకాల లో తెలంగాణ ప్రాంతంలో 6.88% గ్రీన్ కవర్ పెరిగిందని, దీనికి కృషి చేసిన అధికారులు ప్రభుత్వ సిబ్బంది ప్రజా ప్రతినిధులకు చీఫ్ సెక్రటరీ అభినందనలు తెలిపారు.

ప్రతి రైతు వేదికలో అవగాహన కార్యక్రమాల షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని అన్నారు. దళిత బంధు పథకం కింద వ్యవసాయ శాఖ పరిధిలో ఏర్పాటు చేసే యూనిట్ల ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ప్రతి రైతు వేదిక లో ప్రతీ వారం కనీసం రెండు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి రవి మాట్లాడుతూ
జగిత్యాల జిల్లాలో బృహత్ పల్లె ప్రకృతి వనాల స్థలాలు గుర్తించామని, మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని అన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ మొక్కల సంరక్షణ కోసం వాటరింగ్ చేపట్టామని తెలిపారు. జిల్లాలో 377 కిలోమీటర్ల మేర మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టామని, 8వ విడత కింద పెండింగ్ రోడ్లు , కేనాళ్ళు చుట్టూ పక్కల మొక్కలు నాటుటకు చర్యలు చేపడతామని తెలిపారు.

దళిత బంధు పథకం కింద 345 లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేశామని, 89 యూనిట్ల గ్రౌండింగ్ చేశామని, వాహనాల కొనుగోలు ఆర్డర్ ప్లేస్ చేశామని కలెక్టర్ తెలిపారు.

వ్యవసాయ విస్తరణ అధికారులను సమన్వయం చేసుకుంటూ రైతు వేదికలను ఆక్టివ్ గా ఉంచుతామని కలెక్టర్ అన్నారు. జిల్లాలో వరి కోత లకు అనుగుణంగా 54 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ , జిల్లా అటవీ అధికారి ,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి , జిల్లా అధికారులు సంబంధిత అధికారులు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల చేజారి చేయనైనది.

Share This Post