ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా మన ఊరు మన బడి పనులు చేపట్టాలి …జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా మన ఊరు మన బడి పనులు చేపట్టాలి …జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా మన ఊరు మన బడి పనులు చేపట్టాలి …జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, జూలై -21:

విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా
మన ఊరు మన బడి పనులు ప్రణాళిక ప్రకారంగా, పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక సంభందిత అధికారులను ఆదేశించారు.

గురువారం జిల్లా కలెక్టర్ కె. శశాంక మహబూబాబాద్ మండలం కంభాలపల్లీ, జమాండ్లపల్లీ, వి.ఎస్.నగర్ ఎం.పి.పి.ఎస్ పాఠశాలలను సందర్శించి మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చేయవలసిన పనులను పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ ముందుగా కంభాలపల్లి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక, జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉన్న వసతులను, కావలసిన సౌకర్యాలపై సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకొని చేయవలసిన పనులపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎం.పి.పి.ఎస్. పాఠశాలలో 163 మంది విద్యార్థులకు గాను యు.డి. ఐ.సి. లో అదనపు గదుల నిర్మాణం కొరకు ప్రతిపాదనలు సమర్పించ లేదని, హై స్కూల్ కొరకు కావాలని ప్రతిపాదనలు సమర్పించారు అని, రెండు పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉన్నందున విద్యా శాఖ నుండి ఎం.పి.పి.ఎస్. కొరకు కావాల్సిన అదనపు గదుల కొరకు లేఖను వ్రాసి హై స్కూల్ గదులను అవసరం మేరకు వాడుకోవాలని తెలిపారు. కాంపౌండ్ వాల్ ఎత్తు పెంచాలని, హై స్కూల్ లో ఉన్న గదులను కొన్నిటిని నిరుపయోగంగా ఉంచారని, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ కొరకు గదులను సక్రమంగా వినియోగించాలని, పెద్ద గదులను అదనంగా ఉన్న గదులను ప్రైమరీ స్కూల్ కొరకు వాడే విధంగా చూడాలని, ఉపయోగంలో లేని, శిధిలావస్థలో ఉన్న గదులను తొలగించి నిర్మాణం జరిగే వరకు పార్టిషన్ ఏర్పాటు చేసి పిల్లలు నిర్మాణ స్థలం వైపుకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తరగతి గదుల మద్యలో వంట గదులను ఏర్పాటు చేయకుండా ఒక మూల వైపున ఏర్పాటు చేయాలని, హై స్కూల్ కొరకు డైనింగ్ హాల్ కొరకు మొదటి అంతస్తును వాడుకునే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.

బాలురకు, బాలికలకు వేరు వేరుగా టాయ్లెట్ లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పాఠశాలలో ఉన్న ప్రతి గదిని కలెక్టర్ ఈ సందర్భంగా పరిశీలించారు. ఎన్.ఆర్. ఈ.జి.ఎస్. లో నాలుగు బ్లాక్ లలో చేపట్టవలసిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

పదవ తరగతి బోధిస్తున్న తరగతిలోకి వెళ్లి పిల్లలతో పాఠ్యాంశాల పై విషయ పరిజ్ఞానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీచర్ సైన్స్ పాఠ్యాంశం పై చెపుతున్న తీరును, అర్థం అయిన విషయాన్ని తెలుపమని కలెక్టర్ విద్యార్థులను అడగగా, సాయిలేఖ ఇంగ్లీష్ లో కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థినిని కలెక్టర్ అభినందించారు. 10/10 జి.పి. ఏ. సాధించాలని, పదవతరగతి భవిష్యత్ లో మనం ఏమి కావాలి అనే విషయమై వేసే తొలి మెట్టు అని, తొలి అడుగు మంచి మార్కులతో ఆనందంగా, ఇష్టపూర్వకంగా చదివి 10/10 జి.పి. ఏ. సాధించాలని, చదువుతోనే భవిష్యత్తు, డబ్బు, గౌరవం, సమాజంలో ఉన్నత స్థానం దక్కుతుందని కలెక్టర్ విద్యార్థులకు తెలిపారు.

తదుపరి జిల్లా కలెక్టర్ జమాండ్లపల్లి మండల, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలను సందర్శించి పరిశీలించారు.ఎం.పి.పి.ఎస్. లో 156 మంది విద్యార్థులకు గాను ఇంకను 5 గదులు కావాలని, వున్న గదులు కొన్ని శిధిలావస్థలో ఉన్నాయని కలెక్టర్ కు హెచ్.ఎం. ఎస్.కె. ఇమామ్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఉన్న స్థలాన్ని, గదులను పరిశీలించారు. పూర్తిగా పాడైన 2 గదులను తొలగించాలని, రెండు గదులలో మరమ్మతులు చేయాలని, పిల్లర్లు వేసి ఉన్న మొదటి అంతస్తులో స్ట్రక్చర్ ఏర్పాటు చేసి వాడుకలోకి తీసుకొని రావాలని, పాఠశాల ఆవరణ పరిశుభ్రం గా ఉండే విధంగా చూడాలని, మొరం వేసి లెవెలింగ్ చేయాలని, ఓవర్ హెడ్ ట్యాంక్ లను గదుల వెనక క్రింద ఉండడం చూసి పైన నిర్మించాలని, స్థలాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించాలని తెలిపారు. బోర్వేల్ ను రెండు పాఠశాలలకు అనుగుణంగా వాడుకునే విధిగా చూడాలని, మిషన్ భగీరథ నీటిని రెండు పాఠశాలలకు విడి విడిగా పైప్ లైన్ ఏర్పాటు, సంప్ లు ఏర్పాటు చేసి ఇవ్వాలని తెలిపారు. ఐరన్ గ్రిల్స్ కు కలరింగ్ చేసి ఎక్కువ కాలం వుండేలా చూడాలని తెలిపారు. పాఠశాల ఉపయోగార్ధము కొంత మేర స్థలం ఇచ్చే విధంగా కృషి చేయాలని వార్డ్ మెంబర్, గ్రామస్తులను కోరారు.

అనంతరం వి.ఎస్.నగర్ ఎం.పి.పి.ఎస్. పాఠశాలను సందర్శించి పరిశీలించారు. పాఠశాల ఆవరణ మొత్తం మొరం వేసి లెవెలింగ్ చేయాలని, రోడ్డు నుండి పాఠశాల వరకు పిల్లల సౌకర్యం కొరకు రోడ్డు మార్గం వేసే విధంగా విద్యా శాఖ ద్వారా దరఖాస్తును సంబంధిత అధికారులకు అందజేసి రోడ్డు వేసే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పెద్ద రూం లను పార్టిషన్ చేసి వాడుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సి. ఈ. ఓ. రమాదేవి, సర్పంచ్ ఎస్. వీరన్న, ఏ.సి.జి. శ్రీరాములు, ఎం.పి.డి. ఓ. వెంకటేశ్వర్లు, ట్రైబల్ వెల్ఫేర్ ఏ. ఈ. ప్రశాంత్, సంబంధిత పాఠశాలల హెచ్.ఎం.లు లక్ష్మి, ఎస్.కె.ఇమామ్, ఎస్. రాణి, ఎస్.ఎం.సి. చైర్మన్ లు కిరణ్, వి.శైలజ, జామాండ్ల పల్లి వార్డ్ మెంబర్ బండి ఇందిర, హై స్కూల్ హెచ్.ఎం.లు, తదితరులు పాల్గొన్నారు.


Share This Post