ప్రణాళిక ప్రకారం మన ఊరు మన బడి పనులు చేపట్టాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రణాళిక ప్రకారం మన ఊరు మన బడి  పనులు చేపట్టాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

ప్రణాళిక ప్రకారం మన ఊరు మన బడి పనులు చేపట్టాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక

మరిపెడ
మహబూబాబాద్ జిల్లా, మే -11:

ప్రణాళిక ప్రకారం మన ఊరు మన బడి పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులను కోరారు.

బుధవారం మరిపెడ మండలం సీతారాంపురం జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ, మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల లను జిల్లా కలెక్టర్ కె. శశాంక పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం లక్షల రూపాయలు నిధులు వెచ్చించి పనులు చేస్తున్న సందర్భంలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధికారులు సమన్వయంతో పాఠశాలలో కావలసిన పనులను నాణ్యతతో పకడ్బందీగా చేపట్టి పిల్లలకు సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

విద్యార్థుల సంఖ్యను బట్టి టాయ్లెట్ నిర్మాణం, బాలికలకు, బాలురకు విడి విడిగా టాయ్లెట్ ల నిర్మాణం చేపట్టాలని, భోజనం చేసే ప్రాంతంలో వాష్ బేసిన్ లు ఏర్పాటు చేయాలని తెలిపారు. కిచెన్ షెడ్, అదనపు గదుల నిర్మాణం, పాఠశాల గదుల మరమ్మతులు, లైట్స్, ఫాన్స్ , కరెంట్ వైరింగ్, డైనింగ్ హల్ ఏర్పాటు, నీటి నిల్వకు ట్యాంక్ నిర్మాణం వంటి పనులను అవసరం మేరకు చేయాలని, ప్రణాళిక ప్రకారం పనులను చేపట్టాలని, అనవసర ఖర్చులు చేయకుండా అవసరం మేరకు ప్రాధాన్యత ననుసరించి పనులను పటిష్టంగా చేపట్టాలని, పాఠశాలలు తెరవక ముందే ప్రాధాన్యత పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలుపుతూ చేయవల్సిన పనులపై కలెక్టర్ పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాం ప్రసాద్, ఎంపిడిఓ ధన్ సింఘ్, స్పెషల్ ఆఫీసర్ టి. సుధాకర్, ఆర్ అండ్ బి ఈ. ఈ. తానేశ్వర్, మునిసిపల్ కమిషనర్, నోడల్ హెచ్.ఎం. బి. రఘుజి, ఇంచార్జీ హెచ్.ఎం. శ్రీను, టీచర్ నగేష్, ఏ. ఈ. శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

——————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post