slot anti rungkat 2023

slot anti rungkat 2023

slot deposit dana

2023

slot deposit dana

slot gacor

ప్రణాళిక బద్ధంగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి – అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ – Information and Public Relations Department, Government of Telangana

ప్రణాళిక బద్ధంగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి – అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ

ప్రణాళిక బద్ధంగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి  – అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ

ప్రచురణార్థం

ప్రణాళిక బద్ధంగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి – అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ

304 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

ధాన్యం కొనుగోలు పై సమీక్షించిన అదనపు కలెక్టర్

పెద్దపల్లి , నవంబర్ – 28 :

జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం నూతన కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ తన చాంబర్లో వానాకాలం 2022-23 సంవత్సరానికి సంబంధించి ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

రైతులు పండిస్తున్న ధాన్యాన్ని మద్దతు ధరపై ప్రభుత్వం కోనుగొలు చేస్తుందని పెద్దపల్లి జిల్లాలో నవంబర్ 2వ వారం నుంచి పెద్ద ఎత్తున ధాన్యం సరఫరా జరుగుతుందని, వీటిని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసామని అన్నారు.

జిల్లాలో చివరగా మంథని ప్రాంతంలో డిసెంబర్ నెలలో కోతలు జరుగుతాయని, వీటికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు పక్కా కార్యాచరణ తయారు చేయాలని ఆయన సూచించారు.

జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసామని అదనపు కలెక్టర్ అన్నారు. ధాన్యం కొనుగోలు కోసం అవసరమైన గన్ని బ్యాగులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు.

గతంలో మాదిరిగ వానా కాలం సీజన్ లో సైతం జిల్లాలో 294 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని, ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవసరమైన మేర టార్ఫాలిన్లు , గన్ని బ్యాగులు ,తేమ శాతం యంత్రాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.ఇప్పటి వరుకు 120206.000 మెట్రిక్ టన్నుల ధాన్యం
కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.

మార్కెట్ కు ధాన్యం తీసుకొని వచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధాన్యం నాణ్యత, తదితర అంశాల పట్ల పాటించాల్సిన నియమాల పై రైతులకు విస్తృత ప్రచారం కల్పించాలని అదనపు కలెక్టర్ సూచించారు

ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి తోట వెంకటేశ్, మంథని ఆర్.డి. ఓ.వీరబ్రహ్మాచారి, ఎస్.డి.సి. నరసింహా మూర్తి, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post