ప్రతిభకే పట్టం…

ప్రచురణార్థం

ప్రతిభకే పట్టం…

మహబూబాబాద్ సెప్టెంబర్ 23.

విద్యార్థులు సర్టిఫికెట్ల కొరకు విద్య నభ్యసించరాదని సమాజంలో రాణించాలంటే ప్రతిభ కే పట్టం కట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు .

గురువారం గంగారం పర్యటనలో భాగంగా కోమట్ల గూడెంలోని జిల్లా పరిషత్ పాఠాలను సందర్శించారు.

విద్యార్థులతో మాట్లాడారు పలు ప్రశ్నలు వేసి సంతృప్తి చెందారు. విద్యార్థులు సర్టిఫికెట్ల కొరకు విద్యనభ్యసించి రాదని విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని ప్రతిభాపాటవాలను పెంచుకుని ఉన్నత విద్య అభ్యసించాలని అన్నారు.

కోమట్లగూడెం లో ప్రజాప్రతినిధులతో మౌలిక సదుపాయాల కల్పనపై పాఠశాల వసతులను అడిగి తెలుసుకున్నారు ఎంపిపి, జడ్పిహెచ్.ఎస్ పాఠశాల లో నిరంతరం నీటి సరఫరా ఉండి తీరాలని మరుగుదొడ్లు పని చేసేలా విద్యాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

తిరుమలగండి అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి పరిశీలిస్తూ ప్రతిరోజు విద్యార్థులకు పౌష్టిక ఆహారం కొరకు అందజేస్తున్న వివరాలను ప్రదర్శింప చేయాలన్నారు . రిజిస్టర్ ను పరిశీలిస్తూ విద్యార్థుల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలన్నారు

ప్రజాప్రతినిధుల కోరిక మేరకు పాఠశాల వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజలు అందించిన విజ్ఞాపన పై కలెక్టర్ స్పందిస్తూ ఆటోలు ప్రమాదమని తెలిసినా ఆటోల పైనే ప్రయాణిస్తారు అని తద్వారా ఆర్టీసీ బస్సు నష్టాలు వస్తాయని ఆటోలు ఎక్కమని ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానం ఇస్తే ఆర్టిసి బస్సు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

కలెక్టర్ వెంట గిరిజన సంక్షేమం ఉపసంచాలకులు దిలీప్ కుమార్ జడ్పిటిసి ఈ సం రమ ఎంపీపీ సువర్ణ పాక సరోజన తాసిల్దార్ సూర్యనారాయణ ఎంపీడీవో శ్యామ్ సుందర్ వైస్ ఎంపీపీ ముడిగ వీరభద్ర, ఎంపీడీవో సత్యనారాయణ సర్పంచ్ దుగ్గల సుగుణ పంచాయతీ సెక్రెటరీ ఈసం స్వప్న ప్రియ సింధుజ తదితరులు పాల్గొన్నారు
—————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post