ప్రతిభను నమ్ముకొని గొప్పగా ఎదగాలి తల్లిదండ్రులపై ఆధారపడకుండా తమ కాళ్ళపై తాము నిలబడాలి తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేయాలి రాష్ట్ర బీసీ సంక్షేమం సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్

ప్రతిభను నమ్ముకొని గొప్పగా ఎదగాలి

తల్లిదండ్రులపై ఆధారపడకుండా తమ కాళ్ళపై తాము నిలబడాలి

తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేయాలి

రాష్ట్ర బీసీ సంక్షేమం సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్

000000

యువత ప్రతిభను నమ్ముకుని వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని గొప్పగా ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

శనివారం బి ఆర్ అంబేద్కర్ మినీ స్టేడియం లో   డిసిఎస్ అండ్ స్టాఫ్ఫిక్స్ ప్రైవేట్ సహకారంతో జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా ను ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో యువతకు ఉద్యోగాలు రావాలని ప్రతిభ ప్రదర్శించేందుకు జాబ్ మేళా లను ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. యువతీ, యువకులు ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడి తల్లిదండ్రులే మీపై ఆధారపడేలా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి అన్నారు. గతంలో అన్ని రంగాల్లో ఆంధ్ర వాళ్లతోనే ఉద్యోగులు రిక్రూట్ అయి ఉండేవని  తెలంగాణ యువతకు  ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయన్నారు. యువత ప్రతిభను నమ్ముకొని ఉద్యోగాలు పొంది గొప్పగా ఎదిగి తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 83 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పించేందుకు పారదర్శకంగా నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జాబ్ మేళ లో వివిధ కంపెనీలలో నియామకమైన వారికి నియామక పత్రాలు అందించి వారిని అభినందించారు.

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ యువత ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్ మేళా లో జాబ్ ను పొంది మళ్లీ ఇంకా మెరుగైన ఉద్యోగానికి ప్రయత్నించాలని అన్నారు.  తమ సొంత కాళ్లపై నిలబడేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో నిరుద్యోగ యువత గ్రూప్ పరీక్షల్లో రాణించేందుకు వారధి సొసైటీ ద్వారా కొత్త యాప్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ యాప్ ప్లే స్టోర్ లో నుండి వారధి  యాప్ డౌన్లోడ్ చేసుకొని పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి కూర్చున్నారు ఈ యాప్ ద్వారా ఆన్ లైన్ పరీక్షలు రాయొచ్చు అన్నారు. ఇప్పటికే ఈ యాప్ ను 2300 మంది జిల్లా వాసులు వాడుతున్నారు అన్నారు. ఇంట్లో ఖాళీగా ఉండి తల్లిదండ్రుల పై ఆధారపడి ఉండే బదులు ఉద్యోగాలు పొంది సొంత కాళ్ళ మీద నిలబడి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చి దిద్దుకోవాలి అన్నారు.

జిల్లా యువజన మరియు క్రీడల అభివృద్ధి అధికారి రాజ వీరు మాట్లాడుతూ జాబ్ మేళా లో 26 కంపెనీలు అపోలో ఫార్మసీ, బ్లూ ఓసెన్, ప్రీమియర్ హెల్త్ కేర్, రత్న ఆటోమొబైల్, జియో మార్ట్, మహాలక్ష్మి ప్రొఫైల్,  వోడాఫోన్ ఐడియా లిమిటెడ్, వరుణ్ మోటార్స్ తదితర కంపెనీలు పాల్గొన్నాయని, 2732 మంది నిరుద్యోగులు పేరు నమోదు చేసుకున్నారని 348 మందికి నియామక పత్రాలు అందజేయడం జరిగిందని,466 మందికి వెయిటింగ్ లిస్టులో ఉంచడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో  నగర మేయర్ వై సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, కార్పొరేటర్లు, బిసి సంక్షేమ వసతిగృహాల విద్యార్థిని విద్యార్థులు,  తదితరులు పాల్గొన్నారు.

Share This Post