ప్రతిభావంతులైన క్రీడాకారులని ప్రోత్సహించేందుకు ప్రతి మాసంలో క్రీడలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.

*సీఎం కప్ క్రీడలతో క్రీడా పండుగ*

**త్వరలో హనుమకొండలో మెగా క్రీడా టోర్ని నిర్వహణ*

*ప్రతిభావంతులైన క్రీడాకారులని ప్రోత్సహించేందుకు ప్రతి మాసంలో క్రీడలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.*

*ఘనంగా ముగిసిన జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు**

హనుమకొండ, మే, 24.

స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం జరిగిన హనుమకొండ జిల్లా స్థాయి సీఎం కప్ పోటీల ముగింపు కార్యక్రమానికి వినయ్ భాస్కర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో

సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్ర క్రీడా చరిత్రలో హనుమకొండ

జిల్లాకు ప్రత్యేకత ఉందని ఈ ఒరవడిని కొనసాగించేందుకు త్వరలో మెగా టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్ని క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రత్యేక స్పోర్ట్స్ క్యాలెండర్ ను రూపోందిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్,

జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ… క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి వచ్చేందుకు సీఎం కప్ పోటీలు దొహదపడినట్లు చెప్పారు. గతమెంతో ఘనకీర్తిని కలిగిన హనుమకొండ క్రీడా ప్రతిభను రాష్ట్ర రాజధానిలో రెపరెపలాడించాలన్నారు. జిల్లాలో సీఎం కప్ పోటీల విజయవంతానికి కృషి చేసినవారందరికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ….అధికారులందరి సహకారంతో మండల, జిల్లా స్థాయిలో సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో హనుమకొండ జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

చిన్నారులు విద్యార్థి దశలోనే ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ పొందాలన్నారు. ప్రణాళిక బద్ధంగా శ్రమిస్తేనే క్రీడల్లో విజయాలు సాధించగలరన్నారు. రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలో హనుమకొండ జిల్లాను ముందంజలో నిలపాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లాలో సీఎం క పోటీలను విజయవంతంగా నిర్వహించిన క్రీడా శాఖను ఆమె అభినందించారు.అనంతరం వివిధ క్రీడల్లో విజయాలు సాధించిన జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన క్రీడాకారులకు జ్ఞాపికలు, మెడల్స్, సర్టిఫికెట్స్ లను అతిథులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా, ట్రెయినీ ఐపీఎస్ అంకిత్,డీఆర్వో వాసు చంద్ర, డివైఎస్వో జి.అశోక్ కుమార్, డిఇఓ అబ్దుల్ హై, డీసీపీ ఎం ఎం బారీ, ఏసీపీలు కిరణ్ కుమార్, శ్రీనివాస్, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు, పీఈటీలు పాల్గొన్నారు.

Share This Post