ప్రతిరోజు 30 ఎస్ సి కే లు బియ్యం కావాలి…

ప్రచురణార్థం

ప్రతిరోజు 30 ఎస్ సి కే లు బియ్యం కావాలి…

మహబూబాబాద్ డిసెంబర్ 8.

జిల్లాలో రైస్ మిల్ లకు పంపించిన వరి ధాన్యంను బియ్యం గా మార్చి ప్రతిరోజు 30 ఎస్ సి కే లు అందజేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ సమావేశమందిరంలో అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ధాన్యంను బియ్యం గా మార్చే ప్రక్రియ పై సివిల్ సప్లైస్ రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

రబి సీజన్లో మిల్లర్లకు అందజేసిన 231 ఏసి కేల కు సంబంధించిన ధాన్యం బియ్యంగా మార్చే ప్రక్రియలో ప్రస్తుతం 47 శాతం పూర్తి కాగా 50 శాతం పైన బిల్డింగ్ చేయాల్సిన ధాన్యం ఉందని ఈ నెల 31వ తేదీ గడువు గా ఉందన్నారు సంబంధిత అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి రోజూ 20 గంటలు మిల్స్ పని చేస్తూ ఉండాలని తెలియజేశారు లక్ష్యాల మేరకు ఇతర ప్రాంతాల నుంచి అయినా మిల్లింగ్ జయించి బియ్యం అప్పగించాలి అన్నారు.

నిర్ణీత సమయంలో బియ్యం అందించాల్సి ఉందని జాప్యం చేసే పరిస్థితులు ఉన్నందున సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతిరోజు మిల్స్ ను పర్యవేక్షించాలని ప్రతిరోజు మూడు ఏసీ కె లు తప్పనిసరిగా రావాలన్నారు. రోజువారి నివేదిక అందజేయాలన్నారు. ప్రత్యేక అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సకాలంలో ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతారం శ్రీనివాస ఇండస్ట్రీస్ ,కురవి మండలం అయ్యగారి పల్లి తిరుమల ఇండస్ట్రీస్, అదే మండలంలోని మొగిలిచర్ల శ్రీ నవ్య రైస్ మిల్ చిన్న వంగర లక్ష్మీ వాసవి రైస్ మిల్ కేసముద్రం శ్రీ బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లు ల వారీగా ధాన్యం బియ్యం గా మార్చే ప్రక్రియ ను పరిశీలించారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ కొమరయ్య dm civil supplies మహేందర్ పౌర సరఫరాల అధికారి నర్సింగరావు మహబూబాబాద్ మరిపెడ కురవి కేసముద్రం తాసిల్దార్ లు రంజిత్ రమేష్ బాబు తరంగిణి కోమల వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.
——————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post