ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో “నీట్”, ఐ.ఐ.టి సీట్లు సాధించిన విద్యార్థినీలను ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో గురుకుల కళాశాల విద్యార్థినీలు మరిన్ని విజయాలు సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ పేర్కొన్నారు.

ప్రచురణార్ధం

నవంబరు, 14,ఖమ్మం –

ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో “నీట్”, ఐ.ఐ.టి సీట్లు సాధించిన విద్యార్థినీలను ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో గురుకుల కళాశాల విద్యార్థినీలు మరిన్ని విజయాలు సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ పేర్కొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నగరంలోని డా॥బి.ఆర్. అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన బాలల దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ పాల్గొని “సీట్”, “ఐ.ఐ.టి” సీట్లు సాధించిన విద్యార్థినీలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నత విద్యనభ్యసించడానికి మారుమూల ప్రాంతాల విద్యార్థులు కూడా ముందంజలో ఉన్నారని గురుకుల కళాశాల విద్యార్ధినీలు నిరూపించారని అభినందించారు. ఉన్నత విద్యకు అర్హత సాధించిన ప్రవేశ పరీక్ష విద్యార్ధుల జీవితాన్ని మార్చబోతుందని, తల్లిదండ్రుల కలలు సాకారం కానున్నాయని, దీని ప్రభావం కేవలం. కుటుంబం పైనే కాకుండా యావత్తు సమాజంపై చూపుతుందని కలెక్టర్ అన్నారు. గురుకుల కళాశాల బోధకుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారంతో ఈ స్థాయికి ఎదిగేందుకు సాధ్యపడిందని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల కళాశాలను సెంటర్ ఆఫ్ ఎక్స్  లెంట్ గా గుర్తించి “నీట్”, “ఐఐటి” కోచింగ్ను అందిస్తున్నదని, భవిష్యత్తులో గురుకుల కళాశాల విద్యార్థినులు మరిన్ని విజయాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

కళాశాల ప్రిన్స్ పల్  సి .హెచ్, జ్యోతి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేసి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ తెలంగాణ ప్రభుత్వంచే హైద్రాబాద్ లో ప్రారంభించబడిన సెంటర్ నందు  16 మంది. కోచింగ్ తీసుకొనగా, వీరిలో 12 మంది ఎం.బి.బి.ఎస్.కు అర్హత సాధించారని, అలాగే ఈ కావ్య ఐ.టి.టి ఢిల్లీలో, పి.రజనీ నిట్ వరంగల్ లో, జె.రమ్య నిటి బెరంగాబాద్లో, కె. శివాని ఎన్.ఐ.ఎఫ్.టి బెంగుళూరు, యం. తేజస్వీని బిగ్  సాట్ కు  అర్హత సాధించారని తెలిపారు .

కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ జాయింట్ సెక్రటరీ శ్రీమతి కె.శారద, ఖమ్మం రీజియన్ ఆర్.సి.ఓ శ్రీమతి కె. ప్రత్యూష, అదిలాబాద్ రీజియన్ ఆర్.సి.ఓ శ్రీమతి కె.స్వరూపారాణి, డి.సి.పి.ఓ శ్రీమతి విష్ణువందన, డా||సత్యనారాయణ రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమ కళాశాలల ప్రిన్సిపల్స్, కళాశాల విద్యార్థినీలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Share This Post