ప్రతి అధికారి క్లీన్ ఇండియా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహ లతా మొగిలి తెలిపారు.

ప్రచురణార్ధం

అక్టోబరు,05, ఖమ్మం.

ప్రతి అధికారి క్లీన్ ఇండియా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహ లతా మొగిలి తెలిపారు. మంగళవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నెహ్రూ యువకేంద్ర యూత్ కో-ఆర్డినేటర్ అన్వేష్ అధ్యక్షతన జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం అక్టోబర్ 1 నుండి 31 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్లీన్ ఇండియా క్యాంపెన్ లో భాగంగా ప్లాస్టిక్ సేకరించి నిర్వీర్యం చేసే పద్ధతిని తమ తమ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించాలని కోరారు. తద్వారా క్లీన్ ఖమ్మం జిల్లాగా పేరు తెచ్చుకునేందుకు అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఎన్. సి.సి, ఎన్.ఎస్.ఎస్. -కో ఆర్డినేటర్ లు, యూత్ క్లబ్ ప్రతినిధులు, అడ్వైజరీ కమిటీ సభ్యులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతీ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, జిల్లా పంచాయితీ అధికారి ప్రభాకర్రావు, జిల్లా విద్యా శాఖాధికారి యాదయ్య, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పరందామరెడ్డి, ఎకైజ్ సూపరింటెండెంట్ సోమిరెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post