ప్రతి ఇంటికి జాతీయ జెండాను పంపిణీ చేయాలి ….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రతి ఇంటికి జాతీయ జెండాను పంపిణీ చేయాలి ….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -06:

ప్రతి ఇంటికి జాతీయ జెండాను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.

శనివారం కలక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. శశాంక జిల్లాలో ప్రతి ఇంటికి జాతీయ జెండా అందించే విధంగా పంపిణీ పై సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలనుసారం స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ప్రతి ఇంటిపై ఎగురవేసెందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుండి జెండాను అందిస్తున్నట్లు, ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీలోగా మండలానికి, 8వ తేదీలోగా గ్రామ స్థాయిలో జాతీయ జెండాను అందించి 9న ప్రజలకు పంపిణీ మొదలు పెట్టాలని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సెక్రటరీ ల ద్వారా, పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ కమిషనర్ ల ద్వారా జెండాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జెడ్పీ సి. ఈ. ఓ. రమాదేవి, డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, డి.పి. ఓ. సాయిబాబా, ఆర్డీవోలు, డి.ఎల్.పి. ఓలు, మునిసిపల్ కమిషనర్ లు, టి.ఎస్.సి. ఓ. ప్రతినిధులు, సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post