ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగర వేయాలి…… జిల్లా కలెక్టర్ కె. శశాంక 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జెండాలు పంపిణీ…జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగర వేయాలి…… జిల్లా కలెక్టర్ కె. శశాంక   75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జెండాలు పంపిణీ…జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -09:

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం సందర్భంగా ప్రజలు తమ ఇండ్లపై ఆగస్టు 13 తేదీ నుండి 15వ తేదీ వరకు ఇంటింటికి అందజేసిన జెండాలను ఇంటిపై ఎగురవేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

మంగళవారం మధ్యాహ్నం మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక ప్రజాప్రతినిధులతో జిల్లా, మండల గ్రామ స్థాయి, అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి జాతీయ జెండాలను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ గ్రామాన జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, జాతీయ జెండాను, కర్రలను గ్రామపంచాయతీ నుండి అందజేయడం జరుగుతుందని అన్నారు. భారత దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగ ఫలితమే స్వేచ్ఛ సమానత్వం అని, అనేక విధాలుగా ఆయా రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న తరుణంలో గ్రామాలను సమిష్టి కృషితో అభివృద్ధి పథంలో నడిచే విధంగా గ్రామస్తులు, యువకులు, ప్రజా ప్రతినిధులు ముందువరుసలో ఉండాలని కలెక్టర్ తెలిపారు.

మన ఇంటి పండుగగా జెండా పండుగ ను జరుపుకోవాలని, ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలల్లో ఇంటింటా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఈనెల13 వ తేదీన దేశభక్తితో ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఏర్పాటు చేసుకోవాలని, జాతీయ జెండాను, పి వి సి పైపును ప్రతి ఇంటికి కలెక్టర్ అందజేశారు.

ఈ పంపిణీ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ సన్యాసయ్య, జడ్పిటిసి కోఆప్షన్ నెంబర్ పాషా, సర్పంచ్ కుమారి, ఎంపీడీవో కే వెంకటేశ్వర్లు, తహసిల్దార్ నాగ భవాని, ఎం పీ ఓ జి. హరి ప్రసాద్, పంచాయతీ సెక్రెటరీ సుందర్ నాయక్, ఉప సర్పంచ్, వార్డ్ నెంబర్లు ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post