ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమగా వెలిసిల్లాలనేదే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ఉద్దేశం:: జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమగా వెలిసిల్లాలనేదే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ఉద్దేశం అని
జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో యువతీ యువకులకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) పై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది.

ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ
అభివృద్ధి చెందుతున్న ములుగు జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ యువతి యువకులు ఉన్నత చదువులు చదివి పారిశ్రామిక రంగంలో రాణించాలని ఉద్దేశంతో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం చేయూత అందిస్తుందని జిల్లా కలెక్టర్ అన్నారు.

ములుగు జిల్లా ఏర్పడిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా అనేక రకాలుగా అభివృద్ధి జరుగుతుందని, దానికి సంబందించిన పలు చిన్న తరహా సేవా, పారిశ్రామిక కార్యకలాపాలు ఏర్పడుటకు అనువుగా ఉందన్నారు. వీటిని PMEGP ద్వారా విస్త్రుతంగా ఏర్పరుచుకొని ప్రభుత్వం ద్వారా అందె రాయితీలు ఉపయోగించుకొని యువతీ యువకులు ఉపాధి పొందవలేనని కలెక్టర్ కోరారు. దీనికి సంబంధించి జిల్లా యంత్రంగము వివిధ బ్యాంకు ల ద్వారా రుణాలు అందించడానికి పలు కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ITDA PO అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో PMEGP ద్వారా అనేక పరిశ్రమలు ఏర్పారాచాలని కోరినారు.

ఈ కార్యక్రమును ఉద్దేశించి జిల్లా పరిశ్రమల కేంద్రం, జనరల్ మేనేజర్ శ్రీనివాస్ కార్యక్రమంలో మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణ రంగం, టూరిజం, డిజిటల్ ఇండియా మోడల్ CSC కేంద్రాలు , ఇతర సేవా రంగంలో యూనిట్ల ఏర్పాటుకు అనేక అవకాశాలు ఉన్నందున PMEGP ద్వారా స్యయం ఉపాధి యూనిట్ లు ఏర్పరుచుకోగలరని సూచించారు.

ఉన్నత విద్యనభ్యసించి పారిశ్రామిక రంగంలో రాణించాలనే యువతకు చేయూతనిస్తోంది.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించే ఉద్దేశంతో కేంద్రం ప్రభుత్వం ప్రారంభించిన ఈ పధకాన్ని జిల్లా పరిశ్రమల శాఖ, ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్(కేవీఐసీ), ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు (కేవీఐబీ) సంయుక్తంగా అమలుకు పని చేస్తున్నాయి. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పిస్తూ పారిశ్రామిక, సేవా రంగాల్లో బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేసి యువతకు తోడ్పాటు అందిస్తోంది.

అర్హతలు.. రాయితీలు ఇలా..

ఈ పథకానికి 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.. తయారీ రంగ పరి శ్రమలకు రూ. 50 లక్షల లోపు, సేవా రూ.20 లక్షల లోపు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ. ఓబీసీ, దివ్యాంగులు, మహిళలకు 5 శాతం, జనరల్ అభ్యర్థులు 10 శాతం తొలుత పెట్టుబడి వ్యయంగా చెల్లించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో జనరల్ అభ్యర్థులకు 25, పట్టణ ప్రాంతాల్లో 15, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళల అభ్యర్థులకు గ్రామీణ ప్రాంతాల్లో 35, పట్టణ ప్రాంతాల్లో 25 శాతం రాయితీలను అందజేస్తారు. బ్యాంకు నుంచి యూనిట్ వ్యయంలో 50 శాతం మంజూరు చేస్తే నిర్ణీత సమయంలో కేవీఐసీ నుంచి రాయితీ వస్తుంది.

పీఎంఈజీపీ పథకం ద్వారా రుణాలు : వ్యవసాయం, సేవలు, మినరల్ వాటర్, నిర్మాణ రంగ, ఆహార ఉత్పత్తుల తయారీ పరిశ్రమలకు ఆదరణ బాగుంది. జిల్లాలో అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. పరిశ్రమలు రుణాన్ని 3 నుంచి 7 ఏళ్ల లోపు లబ్ధిదారుడు చెల్లించుకునేందుకు అవకాశం ఉంటుంది. జిల్లా పరిశ్రమల శాఖ, అధికారులు పీఎంఈజీపీ పథకంపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.

వివిద రకాల శాఖల సహకారంతో అవగాహన చేపడుతున్నాం. లబ్ధిదారులు మూడేళ్ల పాటు యూనిట్ నడపలేకపోతే రాయితీ రద్దు చేసే అవకాశం ఉంది. బ్యాంకులు సైతం రుణాలు మంజూరు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. రానున్న రోజుల్లో PMEGP కి మరింత ఆదరణ పెరిగేందుకు వీలుంది. ఈ ఆర్దిక సంవత్సరంలో 100 మంది నిరుద్యోగ యువతకు జిల్లా కలక్టర్ గారి ఆదేశాల మేరకు “మోడల్ సి.య.స్సీ డిజిటల్ సేవా కేంద్రాలకు” అనుమతులు మంజూరీ చేయనున్నాము.

ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్,PMEGP జిల్లా నోడల్ అధికారులు అశోక్ కుమార్, రాజేష్ కుమార్, APD శ్రీనివాస్, BC కార్పొరేషన్ DO శ్రీ లక్ష్మణ్, డీపీఎం సతీష్. ఏపీఎం రవి, మోడల్ సి యస్ స్సి ప్రాజెక్ట్ ఇంచార్జ్ బేతోజు హరీ కృష్ణ కుమార్ ప్రజా ప్రతినిధులు, ఒత్సాహకులు, అధికారులు పాల్గొన్నారు.

Share This Post