ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండేలా చైతన్యం చేయలన్నారు : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీ ఎ. అభిషేక్ రెడ్డి*

*ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండేలా చైతన్యం చేయలన్నారు : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీ ఎ. అభిషేక్ రెడ్డి*
• గ్రామాల్లో న్యాయసేవలపై విస్తృత ప్రచారం చేయండి
• సామాన్యులకు క్వాలిటీ లీగల్ ఎయిడ్ అందేలా చూడండి

ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలని, న్యాయపరమైన అవగాహన ప్రతి గ్రామాన్ని చేరేలా, పేదప్రజలకు సైతం సామాన్యులకు క్వాలిటీ లీగల్ ఎయిడ్ అందేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీ ఎ. అభిషేక్ రెడ్డి పేర్కొన్నారు .
జాతీయ న్యాయసేవా అధికార సంస్థ ప్రారంభమై 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని, సిల్వర్‌ జూబ్లీ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో భాగంగా శనివారం లీగల్‌ సర్వీసెస్‌ మెగా క్యాంపును జిల్లా కేంద్రమైన సిద్ధిపేట విపంచి ఆడిటోరియంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు (లీగల్ సర్వీసెస్ మాడ్యుల్ క్యాంపు) జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీ ఎ. అభిషేక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ న్యాయ విజ్ఞాన సదస్సు ముఖ్య ఉద్దేశం న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందడంపై అవగాహన కల్పించడం అన్నారు. న్యాయంను ధిక్కరించే అధికారం ఎవ్వరికి లేదన్నారు. పేద పజలకు లీగల్ రైట్స్ పై అవగాహన కల్పించేందుకు , ఉచిత న్యాయ సహాయం చేసెందుకు వీలుగా జాతీయ ,రాష్ట్ర , జిల్లా స్థాయిలో న్యాయ సేవా ప్రాధికార సంస్థ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ప్రతి ఒక్కరికి ఈ న్యాయ సహాయం అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. న్యాయవాదులు నాణ్యమైన, శ్రేష్టమైన ఉచిత న్యాయ సహాయాన్ని పేదవారికి న్యాయసేవాధికార సంస్థ ద్వారా అందించాలని ఆయన కోరారు. కక్షిదారులు న్యాయ సేవలకు అర్హులైన వారు డబ్బును ఖర్చు చేసుకోకుండా ఉచిత న్యాయ సహాయం పొందాలని, అందుకు న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలని ఆయన సూచించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి, లీగల్ సర్వీసెస్ క్యాంప్ మాడ్యూల్ ను ఆయన ప్రారంభించారు. లీగల్ సర్వీస్ క్యాంపు మాడ్యుల్ ను ఆవిష్కరించారు . ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం పొందే విధంగా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారాన్ని కల్పించాలని జిల్లా అధికారులకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీ ఎ. అభిషేక్ రెడ్డి సూచించారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ శ్రీ బి పాపిరెడ్డి మాట్లాడుతూ …

దేశంలోని ప్రతి మహిళకు, ప్రతి ఎస్సీ, ఎస్టీలకు కార్మికులకు, దివ్యాంగులకు న్యాయసేవ అధికార సంస్థ ద్వారా ఉచితంగా వకీలును పెట్టుకునే హక్కు వారికి ఉంటుందని ఆమె సూచించారు. 1987 ఆర్టికల్‌39(ఎ) ద్వారా ప్రతిఒక్కరికి న్యా యం పొందే హక్కును కల్పించిందని, ఇది పూర్తి స్థాయి లో అమలు కాకపోవడంతో 1995లో న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేసిందన్నారు. ఇది పూర్తి స్థాయి లో అమలు కాకపోవడంతో 1955లో న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేశారని ఆమె గుర్తు చేశారు. సమీప మండల, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, ప్రతి జిల్లాలో న్యా య సేవాధికార సంస్థ కార్యాలయం ఉంటుందని, టోల్‌ ఫ్రీ నెంబర్‌ 15100 ద్వారా సేవలు అందుబాటులో ఉం టాయన్నారు.
వంద క్రిమినల్‌ కేసులు కోర్టుకు వస్తే పేదలు అందులో కనీసం ఒక్కదాంట్లోనైనా న్యాయం పొందలేకపోతున్నారని దీనికి ప్రధాన కారణం.. వారికి చట్టాలపై అవగాహన లేకపోవడమేనని అన్నారు .
ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా పాన్‌ ఇండియా అవేర్‌నెస్‌ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2 నుంచి వచ్చేనెల 14వ తేదీ వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లోని పల్లెపల్లెలో న్యాయ విజ్ఞాన సదస్సులను న్యాయ సేవాధికార సంస్థ ద్వారా నిర్వహించామన్నారు.
పేద ప్రజలు, ఒంటరి మహిళలు, నిరక్ష్యరాసులకు న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవ, సలహా అందుతుందని, వీటిపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు .
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి ఆశాలత మాట్లాడుతూ ….. సిద్దిపేట లో లీగల్ సర్వీసెస్ మాడ్యుల్ క్యాంపు ఏర్పాటుకు ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ శ్రీ బి పాపిరెడ్డి మార్గదర్శనం తో పాటు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారం అందించిందని తెలిపారు .

అనంతరం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎ. అభిషేక్ రెడ్డి ఎస్సి ,బిసి సంక్షేమ శాఖల క్రింద లబ్దిదారులకు ఆర్థిక సహాయ పథకాలు అందించారు . సిద్దిపేట పురపాలకసంఘము పరిధిలోని 12 మెప్మా పట్టణ స్వయం సహాయక బృందాలకు ఒక కోటి రూపాయల వడ్డీ లేని రుణాలను అందించారు .
ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ శ్రీ బి పాపిరెడ్డి ,జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామా రెడ్డి , సీపీ శ్రీ జోయల్ డేవిస్ లు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీ ఎ. అభిషేక్ రెడ్డి ని శాలువా తో సత్కరించి మెమెంటో బహుకరించారు .

ఆకట్టుకున్న స్టాల్స్
న్యాయవిజ్ఞాన సదస్సులో వివిధ ప్రభుత్వశాఖలు, పోలీసుశాఖ ల్జు ఏర్పాటు స్టాల్ లు ఆకట్టుకున్నాయి . న్యాయసేవాధికార సంస్థ ఉచిత న్యాయసేవల లభ్యతను వివరిస్తూ ,పల్లె ప్రగతిపై పంచాయతీ శాఖ, పట్టణ ప్రగతిపై సిద్దిపేట మున్సిపాలిటీ స్టాల్స్‌ ఏర్పాటు చేసాయి . డీఆర్డీఏ, వ్యవసాయ,అనుబంధ శాఖలు , ఉద్యానవనశాఖ, స్త్రీ శిశు సంక్షేమశాఖ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ, నీటిపారుదలశాఖ, అటవీశాఖ, మిషన్‌భగీరథ, చేనేతశాఖలు తమ శాఖల పనితీరు ను వివరిస్తూ స్టాల్స్‌ ఏర్పాటు చేయగా . రెవెన్యూశాఖ ధరణి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ అమలుపై పోలీసుశాఖ భరోసా కేంద్రాల నిర్వహణ, షీటీమ్స్‌ పనితీరు, ట్రాఫిక్‌ రూల్స్‌ అమలు తెలియపరుస్తూ స్టాల్స్‌ ను ఏర్పాటు చేశాయి .
వీటిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎ. అభిషేక్ రెడ్డి , న్యాయ మూర్తులు ,అధికారులతో కలిసి న్యాయ విజ్ఞాన సదస్సు ప్రారంభం కు ముందు సందర్శించారు .
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

సిద్దిపేట తెలంగాణ సాంస్కృతిక సారధి , పోలీస్ కమిషనరేట్ కళా బృందాలు లీగల్ రైట్స్ , ఉచిత న్యాయ సేవల పై ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను కట్టి పడేశాయి .
కళాబృందం సభ్యులు బాల్ నర్స్, రాజు, రవీందర్, తిరుమల, వరకట్నం గురించి భర్త వేధిస్తున్న తీరు నాటకం రూపంలో అత్యద్భుతంగా ప్రదర్శించి, ఉచిత మండల్ లీగల్ సర్వీసెస్ ద్వారా మాయా పైసా లేకుండా కౌన్సిలింగ్ ద్వారా న్యాయం ఎలా పొందవచ్చు అనే అంశంపై నాటకం రూపంలో ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు. ఈ సందర్భంగా గౌరవ తెలంగాణ హైకోర్టు జడ్జ్ అభిషేక్ రెడ్డి గారు ఉచిత న్యాయం ఎలా పొందవచ్చో పోలీస్ కళాబృందం సభ్యులు 2 నిమిషాల నాటకం ద్వారా ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో నాటకం ప్రదర్శించినందుకు కళా బృందం సభ్యులను అభినందించారు. కలబృందాల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. న్యాయ విజ్ఞాన సదస్సుకు పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

కార్యక్రమమంలో ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి జి. నీలిమ , జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామా రెడ్డి , సీపీ శ్రీ జోయల్ డేవిస్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు దేవునూరి రవీందర్,
మెదక్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీ సంతోష్ కుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి ఆశాలత,
మెదక్ ఫస్ట్ క్లాసు అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి కే . సునీత , మెదక్ సెకండ్ క్లాసు అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి టి . అనిత , ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి జె . మైత్రేయి , జహీరాబాద్ సీనియర్ శ్రీ దుర్గా ప్రసాద్ , సంగారెడ్డి సీనియర్ జడ్జి శ్రీమతి బి పుష్పలత , DRO శ్రీ బి చెన్నయ్య, RDO శ్రీ అనంత రెడ్డి, అడిషనల్ డిసిపి శ్రీనివాసులు, రామేశ్వర్, నారాయణ, ఏసీపీలు దేవారెడ్డి, రమేష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post