ప్రతి ఒక్కరికి సహజసిద్దంగా ఆక్సిజన్ అందజేయాలనే హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది :: జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత

పత్రికాప్రకటన తేదిః 07-10-2021
ప్రతి ఒక్కరికి సహజసిద్దంగా ఆక్సిజన్ అందజేయాలనే హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది :: జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత
జగిత్యాల, అక్టోబర్ 07: భూమిపై జీవన ప్రమాణాన్ని సాగించే ప్రతి జీవికి అవసరమైన ప్రాణవాయువు సహాజ సిద్దంగా లభించేలా, రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత అన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రదాన ఆసుపత్రిలో గురువారం ఉదయం PM CARES ( Prime minister’s citizen Assistance and Relief in Emergency Situations Fund) ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలలోని ఆసుపత్రులలో ఏర్పాటు చేసిన PSA ఆక్సీజన్ ప్లాంట్ ను దేశ ప్రదాని శ్రీ నరేంద్రమోది చేతుల మీదుగా ఉత్తరాఖండ్ లో నిర్వహించిన కార్యక్రమం ద్వారా ఆన్లైన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. కార్యక్రమమం అనంతరం దేశ ప్రదాని నరేంద్రమోడీ ప్రసంగాన్ని జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా కలెక్టర్, జగిత్యాల ఎమ్మెల్యే, అసుపత్రి సూపరింటెండెంట్ లు ఆన్ లైన్ ద్వారా వీక్షించి అనంతరం జిల్లా ప్రదాన అసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా కరోనతో పోరాడుతు ప్రాణవాయువు సక్రమంగా అందక ఎంతోమంది ప్రజలను పోగోట్టుకున్నామని, కరోనాతో చికిత్సపొందుతు ప్రాణవాయువు అందక ఎవరుకూడా మరణించకూడదని, ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో రాష్ట్రప్రభుత్వ౦ విమానాల ద్వారా కూడా ఆక్సిజన్ తెప్పించడం వంటి అనేక కార్యక్రమాల చేపట్టి అహర్ణిషలు రాష్ట్రప్రభుత్వం కృషిచేసిందని తెలియజేశారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోనే క్రమంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ ప్లాంట్ లను అందించిందని, అందులో బాగంగా జిల్లా ప్రదాన ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ స్వయంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకుంటు, నిమిషానికి 500 లీటర్ల అక్సిజన్ అందించగల సామర్థ్యం ఈ ప్లాంట్ కు ఉందని తెలిపారు. ఆక్సిజన్ లేకపోతే మానవుని మనుగడే లేకుండా పోతుందని, అలాంటి ప్రాణవాయువు సహజసిద్దం అందించేలా, రాష్ట్ర పభుత్వం ప్రకృతి, పర్యావరణాన్ని పెంపోందించడంలో ప్రతిఒక్కరు బాగస్వాములను చేస్తూ హరితహారం అనే గోప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి హరితవిప్లవాన్ని తీసుకువచ్చి ప్రపంచంలోనే గోప్ప కార్యక్రమైన హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వ౦ రూపుదిద్దిందని పేర్కన్నారు. అక్సిజన్ ప్లాంట్ అందుబాటులో రావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించడంలో మరింత అభివృద్ది చెందిందని అన్నారు.
జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ, కరోనాతో బాదపడే వారిలో ప్రదానంగా అక్సిజన్ సరిగా తీసుకోలేక ఇబ్బందులకు గురవ్వడం వలన వారికి ఆక్సిజన్ సీలీండర్ల ద్వారా ఆక్సిజన్ అందజేయడం జరిగిందని, రెండవ విడత కరోనా ప్రబావ సమయంలో బయటి ప్రాంతాల నుండి ఆక్సిజన్ సిలీండర్లను తెప్పించడం జరిగిందని, పియం కేర్స్ తరపున గౌరవ ప్రదానమంత్రి దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరాష్ట్రానికి ఒక్క PSA ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటుచేసి దానిని దేశానికి అంకితం చేశారని పేర్కోన్నారు. అందులో బాగంగా జిల్లా ప్రదాన అసుపత్రిలో నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్ అందించే సామర్థ్యం గల పిఎస్ఏ ప్లాంటును ఏర్పాటు చేసుకోవడం జరిగిందని పేర్కోన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా దాదాపుగా 100 మందికి సరిపడ ఆక్సిజన్ అందించగలుగుతామని పేర్కోన్నారు.

జగిత్యాల శాసన సభ్యులు డా. యం. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, కరోనా విజృంబించడం, వ్యాదిపై సరైన అవగాహన, చికిత్సకు అవసరమయ్యే మందులు లేకపోవడం చేత కరోన మరణాలు సంబవించాయని అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాక్సిన్ తయారవ్వడం, రెమిడిసివిర్ వ్యాక్సిన్ కూడా మనదగ్గరే ఉండడంతో వాటిని ప్రోత్సహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కి, పరిశ్రమల శాఖా మంత్రి వర్యులకు దన్యవాదాలను తెలియజేశారు. రెండవ దశ కరోనా ప్రబావ సమయంలో ఆక్సిజన్ అందక చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారని, కరోనాను సమర్థమంతంగా ఎదుర్కోనే క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు వసతులు ఉన్న ప్రైవేటు అసుపత్రులకు సైతం అనుమతులు ఇచ్చి కరోనాకు చికిత్సను అందించడం జరిగిందని, అవసరం మేరకు బయటి ప్రాంతాల నుండి ఆక్సిజన్ తెప్పించడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే PSA ఆక్సిజన్ ప్లాంట్ ను అందించడం జరిగిందని పేర్కోన్నారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా ఒకే సారి 40 నుండి 50 మంది వరకు ఆక్సిజన్ అందించగలమని పేర్కొన్నారు. కరోనా ప్రబావ సమయంలో అక్సిజన్ అందించే మిషన్ లను డోనేట్ చేసిన వారికి పేరుపేరున హృదయపూర్వక దన్వవాదాలు తెలియజేశారు. అభివృద్ది దిశగా ప్రభుత్వ౦ కృషిచేస్తుందని అందులో బాగంగా జిల్లాలో 510 కోట్లతో మెడికల్ కాలేజి, సూపర్ స్పెషాలిటి ఫ్యాకల్టిని అందించారని, 7కోట్లతో మదర్ ఆండ్ చైల్డ్ ఆసుపత్రిపైన 40 బెడ్లకు పనులు ప్రారంభమైనాయని, మెడికల్ కళాశాల తరగతి గదులు, ల్యాబ్ మొదలగు వాటి కొరకు 8 కోట్లతో టెండర్లను కూడా పిలవడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రదాన ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీమతి సుదక్షిణదేవి, ఆర్ఎంఏఓ రామకృష్ణ, స్థానిక కౌన్సిల్ దర్మరాజు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

ప్రతి ఒక్కరికి సహజసిద్దంగా ఆక్సిజన్ అందజేయాలనే హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ::
జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత

జిల్లా పౌరసంబంధాల ఆధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచెయనైనది.

Share This Post