ప్రతి ఒక్కరు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ రెండు డోసులు తీసుకునేలా చర్యలు : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ రెండు డోసులు తీసుకునేలా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని నెన్నెల మండలం నార్వాయిపేట, చిత్తాపూర్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలతో పాటు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ 18 సం॥లు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకునేలా మండలంలోని సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని, వ్యాక్సిన్‌ పంపిణీలో కార్యచరణ రూపొందించుకొని ప్రణాళికబద్దంగా వ్యవహరించాలని, నిర్ధేశిత లక్ష్యాలను సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వ్యాక్సినేషన్‌ రెండు డోసుల ఆవశ్యకతపై ప్రజలకు వివరించి టీకా తీసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల పరిధిలో వ్యాక్సినేషన్‌ పై పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసి అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి శ్యామలాదేవి, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి వరలక్ష్మీ, ఏ.పి.ఓ. నరేష్‌ వైద్యాధికారి రామకృష్ణ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post