ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి. పాపిరెడ్డి అన్నారు.

 

ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి. పాపిరెడ్డి అన్నారు.

శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో న్యాయసేవాధికార సంస్థ, సఖి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు వివిధ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజల్లో చట్టాలపై అవగాహన లోపం ఉందన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు వీలైనంత ఎక్కువ మందికి చట్టాలపై అవగాహన కల్పించి చైతన్య పరచడానికి అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో నిరక్షరాస్యులకు చట్టాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. అన్ని విషయాలపై అవగాహన ఉన్నప్పుడే వారు ఆయా చట్టాల ద్వారా న్యాయం పొందగలుగుతారన్నారు.

ఎన్ని చట్టాలున్నా మహిళల పట్ల ఇంకా వివక్షత కొనసాగుతుందన్నారు. రోజు రోజు ఎన్నో చట్టాలు తీసుకువచ్చారని, ఇంకా చాలా రంగాలలో మహిళల ప్రాధాన్యత తక్కువగానే ఉందన్నారు.
చట్టాలపై మహిళలకు ఎక్కువగా అవగాహన ఉండాలన్నారు. అప్పుడే అసమానతలు , లోపాలను సరి చేయవచ్చన్నారు. మహిళలు అనిచివేత కు గురికాకుండా కాపాడాలన్నారు. మహిళలకు చట్టాలు అండగా ఉంటాయన్నారు.

ఏడవ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి ఏ.కర్ణ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు వివిధ రకాల చట్టాల గురించి తెలియజేయాలన్నారు. అప్పుడే వారు న్యాయసేవాధికార సంస్థ, లోక్ అదాలత్ ద్వారా న్యాయ సేవలు ఏ విధంగా పొందవచ్చో తెలుసుకోగలుగుతారన్నారు . ముఖ్యంగా మహిళలకు గృహహింస, ఫోక్సో యాక్ట్ తదితర చట్టాల పై అవగాహన ఉండాలన్నారు. మహిళలు ముందుకు వచ్చి తమ హక్కులు సాధించుకోవాలని సూచించారు.

ఐదవ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి శ్రీమతి జె. మైత్రేయి మాట్లాడుతూ నేరం జరిగినప్పుడు బాధితులు ఫిర్యాదు చేయడం లేదని, పోలీసులకు కంప్లైంట్ ఇస్తే నేరాలను అరికట్టే అవకాశం ఉందన్నారు. నేరం జరగకుండా నివారించడం, జరిగిన నేరం పై ఫిర్యాదు చేయడం సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. చిన్న పిల్లలపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు జరిగితే ఫోక్సో లాంటి కఠిన చట్టాలతో న్యాయం పొందవచ్చని ఆమె తెలిపారు. బాలల లైంగిక వేధింపుల చట్టం పై ఆమె అవగాహన కల్పించారు.

రెండవ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి శ్రీమతి టి. అనిత , ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ అబ్దుల్ జలీల్ వివిధ రకాల చట్టాలతో ఏవిధంగా రక్షణ పొందవచ్చు అన్న విషయాలపై అవగాహన కల్పించారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి హెచ్ ఆశాలత న్యాయసేవాధికార సంస్థ అందిస్తున్న సేవలు, సహాయాన్ని వివరించారు.
సఖి సెంటర్., మహిళ హెల్ప్ లైన్181 ద్వారా అందుతున్న సేవలను వివరించారు.

ఈ అవగాహన సదస్సులో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి పద్మావతి, డిఎస్పి బాలాజీ, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్, మహిళలు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post