ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ తీసుకోవాలి:: రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్

3.05 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ
పోంచి ఉన్న కరోనా 3వ వేవ్ ప్రమాదం
ప్రపంచ దేశాల్లో మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు
త్వరితగతిన పెండింగ్ 2.5 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
ప్రతి గ్రామంలో మల్టీ డిసిప్లినరీ బృందం ఏర్పాటు చేయాలి
ప్రతి గ్రామానికి మరియు వార్డుకు ప్రత్యేక అధికారులను నియమించాలి
గ్రామాల్లో ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకునేలా చర్యలు
సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దు
కరోణ వ్యాక్సినేషన్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర సీఎస్
జనగామ అక్టోబర్ 26 :- అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ కోరారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పై ఆయన మంగళవారం వైద్య శాఖ సెక్రటరీ , పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీ సంజయ్ కుమార్ సుల్తానియా, వైద్య శాఖ డైరెక్టర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ , ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత వారం రోజులుగా యూకె లో 3.1లక్షల(16% పెరుగుదల) కేసులు, రష్యా లో 2.47 లక్షల (17%పెరుగుదల) మరియు అనేక ప్రపంచ దేశాలలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, కరోనా ప్రమాదం పొంచి ఉందని సి ఎస్ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే పొంచి ఉన్న కరోనా ప్రమాదాన్ని నివారించవచ్చని సీఎస్ తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాల పై వయసు గల 2.8 కోట్ల జనాభా ఉందని, వీరికి 5.6 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేయాలని, ఇప్పటి వరకు 3.05 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశామని అధికారులు వివరించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో దాదాపు 93 లక్షల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని, వీటిని జిల్లాలకు తరలించామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ కు ఎలాంటి కొరత లేదని, ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సి ఎస్ కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సబ్ సెంటర్ పరిధిలో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి , ఇతర ఉన్నతాధికారులు నిరంతరం వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించాలని సీఎస్ సూచించారు. వ్యాక్సినేషన్ పర్యవేక్షించేందుకు ప్రతి గ్రామంలో మల్టీ డిసిప్లినరీ బృందం ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామానికి మరియు వార్డు లకు ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎస్ సూచించారు. గ్రామంలో ఏర్పాటు చేసే బృందంలో ఆశ, అంగన్వాడీ, పంచాయితీ సెక్రటరీ, వి.ఆర్.ఏ.రేషన్ షాప్ డీలర్, మరియు జిపి నోడల్ ఆఫీసర్ ఉండాలని అన్నారు. గ్రామాల్లో కోంత మేర ప్రజలు మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకోలేదని, మరికొంతమంది మొదటి డోస్ తీసుకున్నప్పటికీ రెండో డోస్ సమయం గడిచిన తీసుకోవడం లేదని, వారిని గుర్తించి వ్యాక్సిన్ తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని సీఎస్ తెలిపారు. *కరోనా ప్రమాదం ముగియ లేదని , వ్యాక్సిన్ డోసులు తీసుకోని పక్షంలో మరోసారి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ అందించాలని స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ రాష్ట్రంలో చేపట్టామని గత రెండు వారాలుగా ఈ డ్రైవ్ కు ఆశించిన స్థాయిలో పురోగతి లేదని తెలిపారు. ప్రతిరోజు కనీసం 5 లక్షల వ్యాక్సిన్ డోసులు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ప్రతి గ్రామానికి మరియు పట్టణాల్లోని వార్డులకు ప్రత్యేక అధికారులను నియమించాలని, సదరు గ్రామాల్లో మరియు వార్డులో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తి చేసే బాధ్యత సదరు అధికారులపై ఉంటుందని వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ త్వరిత గతిన పూర్తి చేయాలని, దీనికోసం స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. *సామాజిక మాధ్యమాల్లో వ్యాక్సిన్ తీసుకోన్నట్లయితే ఆసరా పెన్షన్, రేషన్ ను ప్రభుత్వం తొలగిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయని, కొంత మంది ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారని, వీటినీ విశ్వసించ వద్దని సి ఎస్ తెలిపారు ఆసరా పెన్షన్ మరియు రేషన్ తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొనప్పటికి కరోనా వ్యాక్సినేషన్ తీసుకోవడం చాలా ముఖ్యమని, వ్యాక్సిన్ తీసుకొని ప్రజలు ముందుకు వచ్చి సమీపంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రంలో తీసుకోవాలని సీఎస్ పిలుపునిచ్చారు
జిల్లా కలెక్టర్ సి హెచ్. శివలింగయ్య , అదనపు కలెక్టర్లు ఏ భాస్కర్ రావు, అబ్ధుల్ హమీద్ , జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎ మహేందర్, జనగామ ఆర్డీవో మధుమోహన్, డిఆర్డిఓ రాం రెడ్డి, డి పి ఓ రంగా చారి, జెడ్పీ సీఈవో. విజయ లక్ష్మి, వైద్య సిబ్బంది ఇతర జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు
——————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి జనగామ చే జారీ చేయ నైనది.

Share This Post