ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని పెంపోందించే నైతిక బాద్యత వహించాలి :: జిల్లాకలెక్టర్ జి. రవి
ప్రచురణార్థం–1 తేదిః 13-08-2021
ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని పెంపోందించే నైతిక బాద్యత వహించాలి :: జిల్లాకలెక్టర్ జి. రవి
జగిత్యాల, అగస్టు 13: 7వ విడత హరితహారం కార్యక్రమంలో బాగంగా ప్రతిఒక్కరు సభ్య సమాజంలొ మొక్కలను నాటే నైతిక బాద్యత వహించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శుక్రవారం రాయికల్ మండలం చింతలూరు గ్రామంలో బృహత్ పల్లెప్రకృతి వనం కొరకు 10 ఎకరాల స్థలాన్ని, బషీర్ పల్లి గ్రామంలో సానిటేషన్ పనులను పరిశీలించారు. అనంతరం విద్యుత్ శాఖ ఆద్వర్యంలో ఇటిక్యాల గ్రామంలోని సబ్ స్టేషన్ లో నిర్వహించిన 7వ విడత హరితహారం కార్యక్రమంలో ఆక్సిజన్ పార్క్ అభివృద్ది, కొత్త మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గోన్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, హరితహారం కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యానికి మించి ఎక్కువ మొక్కలు నాటారని, విద్యుత్ శాఖ వారు నిర్దేశించిన లక్ష్యాలను అదిగమించి ప్రత్యేక చొరవతో పార్కులుగా అభివృద్ది చేశారని కొనియాడారు. మొక్కలు నాటడాన్ని మొక్కుబడిగా కాకుండా అందరికి ఉపయోగపడే పెద్దమొక్కలను నాటడం ద్వారా భూమిని ఎవరు అన్యాక్రాంతం కాకుండా చేశారని తెలియజేశారు. పనిచేసే చోటును ఇంటిపరిసరాలుగా బావించి మొక్కలను నాటాలని, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పోటిపడి జిల్లాలో పల్లెప్రకృతి వనాలను ఒకదాన్ని మించి మరోకటి అనేలా అభివృద్ది చేసి పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ది చేశారని పేర్కోన్నారు. పర్యావరణాన్ని పెంచే నైతిక బాద్యత మనందరిపై ఉందని, ఒక మనిషి సగటున తన నిత్య జీవితకాలంలో సుమారుగా 555 మొక్కలనల నాటితే పర్యావరణాన్ని పెంపొందించగలుగుతారని పేర్కోన్నారు. సబ్ స్టేషన్ లో మొక్కలు నాటడం మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలలో, మిగిలిన సబ్ స్టేషన్ లలో హరితహారం కార్యక్రమంలో బాగాంగా మొక్కలు నాటడానికి కలెక్టర్ నిధుల నుండి 1లక్షా రూపాయలను కేటాయించామన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం మరింత విస్తృతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, అన్ని శాఖల సిబ్బంది పోటాపోటిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, విద్యూత్ శాఖ ఎస్.ఈ వేణుమాదవ్, మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, తహసిల్దార్ మహేష్, యంపిడిఓ సంతోష్ కుమార్, చింతలూర్ సర్పంచ్ అనుపురం శ్రీనివాస్ గౌడ్, ఇటిక్యాల సర్పంచ్ శామల లావణ్య, , తదితరులు పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.
ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని పెంపోందించే నైతిక బాద్యత వహించాలి :: జిల్లాకలెక్టర్ జి. రవి
