ప్రతి ఒక్కరు మంచి మార్గంలో పయనించి విజయం సాధించాలి దసరా సందర్భంగా ఆయుధ పూజలు నిర్వహించిన కలెక్టర్ హరీష్

ప్రెస్​ నోట్​–2                                                                తేదీ : 14–10–2021

============================================

ప్రతి ఒక్కరు మంచి మార్గంలో పయనించి విజయం సాధించాలి

దసరా సందర్భంగా ఆయుధ పూజలు నిర్వహించిన కలెక్టర్​ హరీష్​

ప్రతి ఒక్కరు మంచిమార్గంలో పయనించినప్పుడు తప్పకుండా వారిని విజయం వరిస్తుందని దీనిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ మంచి మార్గంలో పయనించాలని మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ హరీష్​ అన్నారు.

దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్​ ఛాంబర్​లో జిల్లా కలెక్టర్​ ​ ఆయుధ పూజలు నిర్వహించారు. అలాగే  దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా పూలమాలలు వేసి దుర్గామాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  అనంతరం కలెక్టర్​ హరీష్​ మాట్లాడుతూ దసరా (విజయ దశమి) పండగ సందర్భంగా విజయానికి ప్రతీకగా ఉండేందుకుగాను ఆయుధపూజలు నిర్వహిస్తారని ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అన్నారు. పురాణాల ప్రకారం పాండవులు జమ్మిచెట్టుపై ఉంచిన ఆయుధాలతో వనవాసం పూర్తి చేసుకొని యుద్దం చేసి విజయం సాధించారని అలాగే రాముడు సైతం రావణాసురవధ జరిపినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. దీంతో పాటుగా దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను వివిధ అలంకరణలో పూజలు చేసి ఉపవాసదీక్షలు చేస్తారని అనంతరం విజయదశమి (దసరా) రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారని భక్తిభావాలు విరసిల్లేలా ఈ పండగను జరుపుకోవడం ఎంతో శుభపరిణామమని అన్నారు. పండగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్​ హరీశ్​ ఆకాంక్షించారు. దీంతో పాటు దసరా పండగ రోజున జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్లను తప్పకుండా ఉపయోగించి అందరూ పండగను సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రతి ఒక్కరికీ కలెక్టర్​ దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్​, ఆర్డీవోలు రవి, మల్లయ్య, కలెక్టర్ సిబ్బంది ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post