You Are Here:Home→ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలి. వ్యాక్సినేషన్ వేగం పెంచాలి. అందుబాటులో వ్యాక్సిన్. ::: జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.
ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలి. వ్యాక్సినేషన్ వేగం పెంచాలి. అందుబాటులో వ్యాక్సిన్. ::: జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.
జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని వివిధ వార్డులో వ్యాక్సినేషన్ తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ థర్డ్ వేవ్ ముప్పు ఉన్నందున 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. ఇప్పటికే మొదటి డోస్ తీసుకున్నవారు రెండో డోస్ తీసుకోవాలని సూచించారు. జిల్లాలో వ్యాక్సిన్ కొరత లేదని ఇప్పటివరకు మొదటి డోస్ 6,64,109 మందికి అలాగే రెండో డోస్ 3,07,214 మందికి ఇవ్వడం జరిగిందని అన్నారు. జిల్లా అంతట 250 మెడికల్ టీమ్స్ పనిచేస్తున్నామని , ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ కి పూర్తిగా సహకరించాలని అన్నారు. అనంతరం వ్యాక్సినేషన్ తీరును ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామనుజుల రెడ్డి, వార్డ్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలి. వ్యాక్సినేషన్ వేగం పెంచాలి. అందుబాటులో వ్యాక్సిన్. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.