ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా రెండు డోసులు తప్పనిసరిగా తీసుకునేలా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.

ప్రచురణార్ధం..

అక్టోబరు, 26,ఖమ్మం: –

ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా రెండు డోసులు తప్పనిసరిగా తీసుకునేలా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్-19 టీకాల స్పెషల్ డ్రైవ్ పురోగతిని జిల్లాల వారీగా సమీక్షించి జిల్లా కలెక్టర్లకు తగు ఆదేశాలు చేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో 2.8 కోట్ల మంది 18 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారని వారందరికి కోవిడ్ వ్యాక్సినేషన్కు గాను 5.6 కోట్ల డోసులు అందించాల్సి ఉండగా రాష్ట్రంలో ఇప్పటివరకు 3 కోట్ల 5 లక్షల డోసులను ఇవ్వడం జరిగిందని ఆయా జిల్లాల్లో ఇంకనూ ఇవ్వాల్సిన మొదటి, రెండవ డోసు టీకాలను వంద శాతం పూర్తి చేసేందుకు గ్రామస్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయితీ సెక్రటరీలు, రేషన్ షాప్ డీలర్స్ వి.ఆర్.ఏలు, ఆశా వర్కర్లతో కూడిన మల్టీ డిసిప్లీనరీ. టీంలను ఏర్పాటు చేసి లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరుకునేందుకు టీకా ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇట్టి బృంధాలు ప్రతి ఆవాసానికి వెళ్లి డోర్ టూ డోర్ సర్వే ఆధారంగా ఇప్పటివరకు మొదటి డోసు తీసుకున్నవారు, రెండవ డోసు తీసుకున్న వారు, అసలు టీకా తీసుకోని వారిని గుర్తించి కోవిడ్ టీకాల ప్రత్యేక శిభిరాల ద్వారా వారందరికీ టీకాలను ఇవ్వాలని ముఖ్య కార్యదర్శి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దీనితో పాటు ప్రతి గ్రామపంచాయితీకి, ప్రతి వార్డుకు నోడల్ అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు కోవిడ్-19 టీకా ప్రక్రియను క్షేత్రస్థాయిలో తప్పని సరిగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రపంచంలో వివిధ దేశాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయని రష్యాలో గత వారం రోజులలో 2.47 లక్షల కేసులు నమోదు అయ్యాయని, 7230 మరణాలు సంభవించాయని అదేవిధంగా యునైటెడ్ కింగ్ డ మ్ లో 934 మరణాలు సంభవించాయని, చైనా, బ్రెజిల్, జర్మనీ, బెల్జియం, ఉక్రేయిన్ దేశాలలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని మన రాష్ట్రంలో ప్రజలందరూ కరోనా బారి నుండి సురక్షితంగా ఉండేందుకు, 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీక తప్పనిసరిగా తీసుకొని ఉండాలని నవంబరు, డిసెంబరు నెలాఖరు నాటికి మొదటి, రెండవ డోసుల టీకా ప్రక్రియ వందశాతం పూర్తి కావాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు సూచించారు.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లాలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను వివరిస్తూ జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన 10 లక్షల 60 వేల 576 మందిని గుర్తించడం జరిగిందని, 8 లక్షల 20 వేల 593 మంది మొదటి డోసు, 2 లక్షల 73 వేల 642 మంది రెండవ డోసు పూర్తి చేసుకున్నారని జిల్లాలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కొరకు స్పెషల్ క్యాంపెన్ చేపట్టి ప్రత్యేక శిభిరాలను ఏర్పాటు చేసి గ్రామలకు, వార్డులకు ప్రత్యేక నోడల్ ఆఫీసర్లను నియమించి ఇంకనూ టీకా తీసుకోని వారికి అవగాహన కల్పించడంతో పాటు వెనువెంటనే టీకాలు వేయించే ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రజల సందేహాలకు సలహాలు, సూచనలు: అందించడానికి కలెక్టరేట్లో ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆశాలు, పంచాయితీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, వి. ఆర్. ఏలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేసి ప్రజలను చైతన్యపరుస్తూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు రెండు డోసుల టీకా పూర్తి చేసుకునే విధంగా జిల్లాలో టీకాల స్పెషల్ డ్రైవ్ ప్రక్రియ కొనసాగుతుందని జిల్లాలో ఇంకనూ సరిపోను. టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎస్. మధుసూథన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతీ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఇంచార్జ్ జిల్లా పంచాయితీ అధికారి అప్పారావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా॥అలివేలు, జిల్లా సర్వేలెన్స్ అధికారి డా॥ రాజేష్, డా||కోటిరత్నం, డా॥సైదులు, సంబంధిత అధికారులు, తదితరులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

Share This Post