*ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

*ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 8: ఉపాధి హామీ ద్వారా ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించే దిశగా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడివోలు, ఎంపీవోలు, సీడీపీవోలు, అంగన్వాడీ సూపర్వైజర్లతో ఉపాధి హామీ, పల్లె ప్రగతి పనులు, హరితహారం, పోషణ్ అభియాన్ కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ చట్టం అమలుచేయాలని, పని కావాలని కోరిన వారికి పని కల్పించాలని అన్నారు. ప్రగతిలో ఉన్న పనులు, క్రొత్తగా అవసరమున్న పనులు గుర్తించి, ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. డిమాండ్ మేరకు పనులు చేపట్టాలని, పని ప్రదేశాల్లో వసతుల కల్పన చేయాలని అన్నారు. పని ప్రదేశంలోనే జాబ్ కార్డు ఉండాలని, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆయన తెలిపారు. లేబర్ బడ్జెట్ ఎంత ఉంది, దానికి రెట్టింపు మొత్తంలో షెల్ఫులు ఉండాలని, చెల్లింపులు సకాలంలో జరగాలని, వేజ్ రేట్ సగటు పెంచాలని ఆయన అన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలని, పిచ్చి మొక్కలు తొలగించడం చేయాలని అన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, పాడుబడిన బావులు, పనిచేయని బోర్ బావులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆవెన్యూ ప్లాంటేషన్ లో వంగిన, పడిపోయిన ట్రీ గార్డ్స్ సరిచేయాలని, చనిపోయిన మొక్కల స్థానంలో క్రొత్త మొక్కలు నాటాలని అన్నారు. క్రిమిటోరియం, నర్సరీల నిర్వహణ చేయాలని అన్నారు. సెగ్రిగేషన్ షెడ్లను ఉపయోగం లోకి తేవాలని, ఇంటివద్దే తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేలా అవగాహన కల్పించాలని అన్నారు. సాలీడ్ వెస్ట్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా జరగాలని ఆయన తెలిపారు. ప్రతి ఆవాసంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుచేసుకున్నట్లు ఆయన అన్నారు. ప్రతి మండలానికి ఒక బృహత్ ప్రకృతి వనం, ప్రతి మండలానికి 4 మినీ బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు వేగం చేయాలన్నారు. తెలంగాణా కు హరితహారం కార్యక్రమంలో భాగంగా వార్షిక లక్ష్యం 33 లక్షల 50 వేల మొక్కలు నాటడం పూర్తి చేయాలన్నారు. ఆవెన్యూ ప్లాంటేషన్ క్రింద మల్టి లేయర్ మొక్కల ప్లాంటేషన్ కు చర్యలు చేపట్టాలన్నారు. నాటిన మొక్కల వంద శాతం మనుగడకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నర్సరీల్లో డిమాండ్ మేరకు మొక్కల పెంపకం చేయాలన్నారు. 104 సబ్ సెంటర్లలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు, సమన్వయంతో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. పోషణ్ అభియాన్ క్రింద గుర్తించిన పోషణ లోపం ఉన్న పిల్లలను మాములు స్థితికి తెచ్చుటకు ప్రణాళికాబద్ద చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఉన్న 695 అంగన్వాడీ కేంద్రాల్లో సూపర్వైజర్ల పరిధిలో ఎన్నేసి కేంద్రాలు ప్రారంభించింది, ఇంకనూ ప్రారంభించని కేంద్రాలకు కారణాలతో సహా నివేదిక సమర్పించాలన్నారు. ఆరోగ్య తెలంగాణా నిర్మాణానికి కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అబ్దుల్ హామీద్, డిఆర్డీవో జి. రాంరెడ్డి, డిడబ్ల్యుఓ జయంతి, డిపివో కె. రంగాచారి, జెడ్పి సిఇఓ ఎల్. విజయలక్ష్మి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post