ప్రతి గ్రామంలో పారిశుద్ద్య నిర్వహణ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సర్పంచులకు సూచించారు.

సోమవారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆజాద్ కా అమృత్ మహోత్సవం స్వచ్ఛత హి సేవ-2021 లో భాగంగా ఓడిఎఫ్ ప్లస్ గ్రామాల పైన సర్పంచ్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి జరగాలంటే ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసినప్పుడే గ్రామఅభివృద్ధిసాధ్యమవుతుందని అన్నారు. సర్పంచులు, పంచాయతీ సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహించాలనీ అన్నారు. ప్రతి ఇంట్లో టాయ్లెట్ సౌకర్యం కల్పించాలని సూచించారు. వ్యర్థాలను తడి,పొడి చెత్త గా వేరు చేయాలని అన్నారు. ప్రతి రోజు ట్రాక్టర్ ద్వారా చెత్తను పారవేయాలని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ odf plus గ్రామాలుగా ప్రకటించుటకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. వంద శాతం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించిన 23 గ్రామాల కు కలెక్టర్ సర్పంచ్ లకు సర్టిఫికేట్ లను అందచేశారు. గ్రామ అభివృద్ధి కి విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన అన్నారు. వంద శాతం వ్యాక్సినేషన్ గ్రామం గా ప్రకటించేందుకు సర్పంచ్ లు కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్డీఓ శ్రీనివాస కుమార్,
AO శ్రీనివాస్ రెడ్డి, స్వచ్ఛభారత్ జిల్లా కోఆర్డినేటర్ సంపత్ కుమార్, ప్రవీణ్,
ఎం పి డి ఓ లు, 23 గ్రామల సర్పంచులు , కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post