ప్రతి గ్రామం, పట్టణం పచ్చదనం, పరిశుభ్రంగా ఉండాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన                                                                                                               తేదిః 05-07-2021

ప్రతి గ్రామం పట్టణం పచ్చదనం, పరిశుభ్రంగా ఉండాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

         జగిత్యాల, జూలై 05: జిల్లాలోని  పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రత, పచ్చదనంతో ఉండాలంటే పరిసరాలు నీట్, క్లీన్, గ్రీన్ గా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు.  సోమవారం జగిత్యాల రూరల్ మండలం లోని కల్లెడ గ్రామంలో చేపడుతున్న పల్లెప్రగతి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్బంగా హరితహారం కార్యక్రమం లో భాగంగా రహదారి వెంబడి నాటుతున్న మొక్కలను, గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను స్వయంగా తనిఖీ చేశారు.   రహదారి వెంట మూడు వరుసలలో రోడ్డుపై వెల్లే వాహనాలకు ఇబ్బందులు తలెత్తకండా కొంత స్థలాన్ని వదిలి మొక్కలను నాటాలని,  నాటిన ప్రతిమొక్క సంరక్షిపబడాలని, వాటికి ప్రతిరోజు నీరు అందించడం, ట్రీగార్డుల ఏర్పాటు చేయడం, పశువుల వలన మొక్కలు పాడైపోయినట్లయితే  వాటి స్థానంలో కొత్తమొక్కలను నాటాలని, ఎవరైన మొక్కలను తొలగించడం, విరిచేయడం చేసిన వారితోనే మొక్కను తెప్పించి, వాటి ఖర్చును వారేభరించేలా చేయాలని సూచించారు.  వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నందున, మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ప్రతి రోజు ప్రత్యేక సానిటేషన్ కార్యక్రమాలను చేపట్టాలని, రోడ్లపై నీరు నిలిచిపోకుండా చూసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి లక్ష్మీనారాయణ, డిపిఓ నరేష్, ఎంపీడీవో రాజేశ్వరి, సర్పంచ్ జోగిన పెల్లి నాగేశ్వర్ రావు, పంచాయతీ కార్యదర్శి ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయననది.

Share This Post