ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో తెలంగాణ క్రీడా ప్రాంగణానికి త్వరితగతిన భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ నిఖిల…

ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో తెలంగాణ క్రీడా ప్రాంగణానికి త్వరితగతిన భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ నిఖిల మండల తహసీల్దార్లను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేటులోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా మారుమూల గ్రామాలనుండి విచేసిన ప్రజలనుండి జిల్లా కలెక్టర్ 174 విజ్ఞప్తులను స్వీకరించారు.
అనంతరం మండల తహసీల్దార్లతో గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సేకరించాల్సిన భూముల వివరాలు, ప్రభుత్వ జి.ఒ. 58, 59 లో వచ్చిన దరఖాస్తులపై సమీక్ష నివహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ క్రీడా ప్రాంగణానికి కావలసిన భూములను సేకరించేందుకు తహసీల్దారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రెండు రోజుల్లో నివేదికలు ఆందజేయాలన్నారు. గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఆవశ్యకత ఎంతో అవసరమని దీనికి అనుగుణంగా గ్రామాల్లో సుమారు 20 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు స్థలాలను గుర్తించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ స్థలాలు లేని పక్షంలో నీరు చేరే అవకాశం లేని శిఖం భూములల్లో క్రీడా ప్రాంగణానికి స్థల నిర్దారణ చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో గ్రామాలకు అతి సమీపంలో అటవీ భూములుంటే అక్కడ క్రీడా ప్రాంగణాలాకు స్థల కేటాయింపుకు చర్యలు చేపట్టాలన్నారు. దీర్ఘ కాలంగా భూములను పడావులో ఉంచిన భూ యజమానులను సంప్రదించి క్రీడా ప్రాంగణానికి కనీసం 2 వేల గజాలు గజాల స్థలాన్ని కేటాయించేందుకు ఒప్పించాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. భూ సేకరణ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మండలాల్లో వెంచర్ల నిమిత్తం పంచాయతీలు అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో 10 శాతం స్థలాన్ని కమ్యూనిటీ క్రీడా ప్రాంగణానికి కేటాయించేలా చూడాలని సూచించారు.
58, 59 జి.ఒ.ల ప్రకారం భూముల క్రమబద్దీకరణకు గాను యాప్ అందుబాటులోకి వచ్చిందని జిల్లాలో క్రమబద్దీకరణకు 800 దరఖాస్తులు వచ్చాయని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఆమోదించే దిశగా పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. వాస్తవ విచారణ, డాకుమెంట్స్ నిక్షిపతంగా పరిశీలించి తొందరపాటుతో ఎలాంటి లోపాలు జరుగకుండా ఆమోదించాలన్నారు. ఈ ప్రక్రియను 2 రోజుల్లో పూర్తి చేయాలని తెలిపారు. భూముల క్రమబద్దీకరణ పురోగతిపై గురువారం (మే-26 ) టెలీకాన్ఫెరెన్స్ నిర్వహిస్తానని తెలిపారు.
ఈ సమావేశంలో తాండూర్, వికారాబాద్ రెవిన్యూ డివిజన్ అధికారులు అశోక్ కుమార్, విజయ కుమారి, కలెక్టరేట్ పరిపాలనాధికారి హరిత, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post