ప్రతి గ్రామాన్ని వంద శాతం వాక్సినేషన్ గ్రామంగా తీర్చిదిద్దెందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి – రాష్ట్ర ఆర్ధిక మరియు వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి. హరీష్ రావు

రాష్ట్రంలోనే వాక్సినేషన్ మొదటి డోస్ 104% పూర్తి చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టరును, వైద్య ఆరోగ్య అధికారిని, వైద్య సిబ్బందిని రాష్ట్ర ఆర్ధిక మరియు వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి. హరీష్ రావు అభినందించారు.

ప్రతి గ్రామాన్ని వంద శాతం వాక్సినేషన్ గ్రామంగా తీర్చిదిద్దెందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర ఆర్ధిక మరియు వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి. హరీష్ రావు జిల్లా కలెక్టర్లను, జిల్లా వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు.

శనివారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టరులు, వైద్య ఆరోగ్య అధికారులు, పంచాయతీ అధికారులతో వాక్సినేషన్ పై రాష్ట్ర ఆర్ధిక మరియు వైద్య ఆరోగ్య మంత్రి టి. హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేశములోనే వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు ఉంచేందుకు కలెక్టరులు, వైద్య అధికారులు, సిబ్బంది కృషి చేయాలనీ మంత్రి సూచించారు. మొదటి డోస్, రొండో డోస్ లు ప్రతి జిల్లాలో వంద శాతం పూర్తి చేయాలని, వాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు కోవిడ్ టీకా తీసుకునేలా చూడాలని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలకు వైద్యులు, వైద్య సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉండాలని, ఆసుపత్రులలో వైద్య పరికరాలు అన్ని సక్రమంగా పని చేసేలా చూడాలని, పని చేయని వాటికీ మరమత్తులు చేపట్టి వినియోగములోకి తీసుకురావాలని సూచించారు. ఆశా వర్కర్ నుంచి సూపరింటెండెంట్ వరకు ప్రతి ఒక్కరు పని చేసే విదంగా కలెక్టరులు పర్యవేక్షిణించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను. జిల్లా ఆసుపత్రులను ఎప్పుడు కలెక్టరులు తనిఖీ చేసి రోగులకు సరియైన వైద్యం అందిచేలా వైద్యులు, సిబ్బంది పని చేసేలా చూడాలని కలెక్టర్లకు తెలిపారు. వైద్యం కోసం ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే విదంగా ఆసుపత్రులను తీర్చిదిద్దాలని సూచించారు. అన్ని ఆరోగ్య కేంద్రాలలో సమయానికి ఉండాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. వైద్య సేవలో జవాబుదారితనం పెంచాలన్నారు వైద్యశాలను నిరంతరం తనిఖీ చేయాలని వైద్య సిబ్బంది నియామక అధికారాలను కలెక్టర్లకు అప్పగించామన్నారు.

ప్రజల్లో ప్రభుత్వం వైద్యం పట్ల నమ్మకాన్ని పెంచాలని మంత్రి సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు 10 వేల కోట్లు ఆరోగ్యం కొరకు కేటాయించినట్లు తెలియజేశారు. తెలంగాణ డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు చేరే విధంగా వైద్యాధికారులు శాంపిల్స్ లక్ష్యాలను పెంచాలన్నారు. హాస్పిటల్లో సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని సర్జరీలు చేపట్టాలన్నారు. ఓ పి పెరగాలని తెలియజేశారు. శానిటేషన్ ప్రధానమని మెరుగు పరిచే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు వైద్య అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆస్పత్రులలో అందించే భోజనాల నాణ్యతను కూడా పరిశీలించాలన్నారు అదేవిధంగా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు వైద్యశాల పనితీరుపై రోగులతో మాట్లాడాలని అధికారులకు సూచించారు మలేరియా టిబి లెప్రసి బ్లైండ్నెస్ వంటి నాలుగు అంశాలపై నిరంతరం దృష్టి పెట్టాలన్నారు ఆర్ బిహెచ్ కె వాహనాలు వినియోగించుకొని వైద్య సేవలను అందించాలన్నారు జిల్లాల లో పర్యటిస్తానని సేవలు బాగుంటే అవార్డులు అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ, ప్రవేటు హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 946 రకాల వైద్యసేవలు అందిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కి అదనంగా ఆయుష్మాన్ భారత్ కింద 646 రకాల వైద్య సేవలను ప్రభుత్వం చేర్చిన్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోనే వాక్సినేషన్ మొదటి డోస్ 104% పూర్తి చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టరును, వైద్య ఆరోగ్య అధికారిని, వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. రెండో డోస్ కూడా వంద శాతం పూర్తి చేయుటకు జిహెచ్ఎంసి కమిషనర్లతో కోఆర్డినేట్ చేసుకొని పూర్తి చేయాలనీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టరలకు సూచించారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి డోస్ వంద శాతం పూర్తి చేయుటకు చేపట్టిన విదంగానే కార్యక్రమాలు చేపట్టి రెండు వారాలలో పూర్తి చేస్తామని , తమరి సూచనల ప్రకారం ఆసుపత్రులను తనిఖీ చేసి అన్ని విధాలుగా ప్రజలకు వైద్యం అందిచేందుకు, అన్ని విభాగాల సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు చేపడతామని మంత్రికి తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, వైద్యాధికారి డాక్టర్ స్వరాజ్య లక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

 

Share This Post