ప్రతి జిన్నింగ్ మిల్లులో ఒక హెల్ప్ డెస్క్::కలెక్టర్ బి.గోపి

పత్తి కొనుగోలు ప్రక్రియ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి.గోపి అన్నారు.

20 – 21 వ సం..ఖరీఫ్ సీజన్ కు గాను వచ్చే పత్తి పంట కొనుగోలుకై చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్కెటింగ్ CCI , జిన్నింగ్ మిల్స్ యాజమాన్యాలు మరియు రైతులతో కలెక్టర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అగ్రికల్చర్, మార్కెటింగ్ ,డి ఆర్ డి ఓ శాఖలకు చెందిన ముగ్గురు అధికారులను నియమిస్తూ ప్రతీ జిన్నింగ్ మిల్ లో రైతుల కోసం ఒక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని మార్కెటింగ్ డి.ఎం అని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో 1,09,700 ఎకరాలలో సాగు అయిన పత్తి పంట దాదాపు 96 వేల మెట్రిక్ టన్నులు ఉంటుందని, దీనిని అమ్మేందుకు జిల్లా పరిధిలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్, నర్సంపేట, నెక్కొండ, వర్ధన్నపేట, మార్కెట్ కమిటీలకు రైతులు వస్తారని కలెక్టర్ తెలిపారు.

ఇందుకుగాను సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకొని ఎలాంటి సమస్యలు రాకుండా కొనుగోలు జరిగేలా చూడాలన్నారు.

8-12 మధ్య గల తేమశాతం ఉన్న పతిౖకి ప్రభుత్వం మద్దతు ధర 6025 రూపాయలను ప్రతి కింటా పత్తికి ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో 38 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయని… తేమ విషయంలో రైతులు సరిగ్గా అవగాహన కలిగి ఉండాలన్నారు.

టెక్స్టైల్ పార్కు లో ఏర్పాటు చేయనున్న ఒక ప్రముఖ కంపెనీవారు విదేశాలకు చిన్నపిల్లల దుస్తులను తయారుచేసి ఎగుమతి చేస్తారని…. ఈ కంపెనీకి దాదాపు జిల్లాలో పండే పత్తి పంట మొత్తం అవసరమవుతుందని కలెక్టర్ తెలిపారు.

నాణ్యమైన ప్రతి పంట ను పండించే రైతులకు భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయి అని అన్నారు.

మార్కెట్కు వచ్చే ముందు రైతులు పత్తిని ఆర పెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇటు అధికారులు కూడా తేమ ను కొలిచే యంత్రాలు సరిపడా ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు.

ఈ సమావేశంలో డిసిపి వెంకటలక్ష్మి,అదనపు కలెక్టర్ హరి సింగ్ ,ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాగ్యలక్ష్మి, జెడి ఉషా దయాల్, సిసిఐ ఎడి ప్రవీణ్ కుమార్, డిఎం ప్రసాద్, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ, వివిధ రైతు సంఘాల నాయకులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post